KCR: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్.. ఆ భవన్‌కు వెళ్లింది ఇద్దరే.. కాళేశ్వరంపై ముగిసిన న్యాయ విచారణ..
కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను వన్ టు వన్ విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. పలు కీలక వివరాలను అడిగి తెలుసుకుంది. మధ్యాహ్నం 12గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కారు డోరులో నిలబడి.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. నేరుగా హైదరాదాద్ లోని బీఆర్కే భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు కేసీఆర్ పయనమయ్యారు.
కాగా.. కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికే అనుమతిచ్చిన కమిషన్.. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతించింది. విచారణలో జస్టిస్ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ కలిసి కేసీఆర్ ను ప్రశ్నించారు.
బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్
కాగా.. బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హాజరయ్యారు. మల్లెల బాజ్జీపై హత్యాయత్నం కేసులో విచారణను ఎదుర్కొన్నారు ఎన్టీఆర్.. మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ తర్వాత… BRK భవన్‌లో న్యాయవిచారణ ఎదుర్కొన్న రెండో సీఎంగా కేసీఆర్ నిలిచారు.
మొదట ఓపెన్ కోర్టులో కేసీఆర్ బహిరంగ విచారణ జరుగుతుందని అంతా భావించినా… ఆరోగ్యరీత్యా వన్ టు వన్ విచారణ కోరారు కేసీఆర్. ఆయన విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్ ఘోష్ కమిషన్… కేసీఆర్‌తో పాటు లోపలికి 9 మందికి అనుమతించింది. అయితే, చివరగా హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మా రావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు లోపలికి అనుమతించారు.
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ఇక, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. కాళేశ్వరం తెలంగాణలో కాకుండా.. ఇంకెక్కడ కట్టినా కేసీఆర్‌కు అత్యున్నత పురస్కారం దక్కేదన్నారు కేటీఆర్. చిల్లర రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నచోట కాకుండా, ఇంకెక్కడైనా కడితే.. గొప్ప గౌరవం దక్కేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రయత్నించిన కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయకుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ విచారణలో నిజాలన్నీ నిగ్గుతేలుతాయన్న కేటీఆర్.. ఈ పార్టీలకు ప్రజలకు తగిన బుద్ధి చెబుతాయని స్పష్టం చేశారు.
మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణలో చివరి ఘట్టం ముగిసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన కమిషన్ 115వ వ్యక్తిగా కేసీఆర్‌ను ప్రశ్నించింది. ప్పటికే హరీష్ రావు, ఈటలను విచారించిన కమిషన్ .. కేసీఆర్‌ను కూడా విచారించడంతో… జస్టిస్ ఘోష్ కమిషన్ టాస్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. జులై నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో.. ఇక కమిషన్ కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
టైమ్ అంటే టైమే..
కరెక్టుగా 11గంటలకు బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు కేసీఆర్.. పదిగంటల తర్వాత ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి బయల్దేరిని కేసీఆర్… భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్ బయలు దేరగా, ఆయనకు మద్దతుగా గులాబీ దండు వెంట నడిచింది. 12గంటలకు విచారణ ప్రారంభం కాగా… సరిగ్గా ఒక గంటల తర్వాత… బీఆర్కే భవన్ వెలుపలకు వచ్చారు.
ఆసక్తికర పరిణామం..
ఇక, కేసీఆర్ విచారణ సందర్భంగా… ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటీవల తండ్రికి లేఖరాసి వివాదం రేపిన ఎమ్మెల్సీ కవిత… తొలిసారిగా కేసీఆర్‌ను కలిశారు. భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే కేసీఆర్‌కి నోటీసులు నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచేసిన కవిత..ఇవాళ ఫామ్‌హౌస్‌కి వెళ్లి కేసీఆర్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..