Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే వేడుకల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యం పట్టుబడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చింది. రిసార్టులో పెద్దపెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల ఫిర్యాదుతో మహిళా ఎస్సై త్రిపుర రిసార్ట్ కి వెళ్లింది. అక్కడ పదిమంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించాం. అందరూ కూడా మధ్యమత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించాం’
‘మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లుగా అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడు. అలాగే బర్త్ డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు, ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించాము. ఇదే విషయంపై బర్త్ డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించాం. తమ పార్టీ అనుమతి లిక్కర్ అనుమతి డీజే అనుమతి లేదని చెప్పారు. డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజు చేస్తున్నట్లుగా గుర్తించాం. పార్టీలో పాల్గొన్న పురుషులు మహిళలు అందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించాం. డ్రగ్ కిట్టు ద్వారా అందర్నీ పరీక్షిస్తే ఒక్కరు గంజాయి తీసుకున్నట్లు తేలింది. మంగ్లీ అనుచరుడుగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించాం. దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించి పంపించేశాం. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించాం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కేసు నమోదు చేశాం. పోలీసుల ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశాం. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ పైన కేసు పెట్టాం. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం’
మంగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం..
Police seized Foreign Liquor and Ganja at popular Singer Mangli’s Birthday Bash at Tripura resort in Chevella, outskirts of Hyderabad.#Mangli #Chevella #ForeignLiquor #Ganja pic.twitter.com/CeZ2SFJVIP
— Surya Reddy (@jsuryareddy) June 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.