ఒక్క ఫోటోతో.. సోషల్ మీడియాను ఫిదా చేసిన రష్మిక
ఎవరైతే తమను తాము ప్రమోట్ చేసుకుంటారో.. వాళ్లే.. ఈ రోజుల్లో జనాల నోళ్లలో నానుతున్నారు. అలా తమ మాటలతో.. చేతలతో... మూమెంట్స్‌తో.. వెళ్లిన ప్రతీ ఈవెంట్లో హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ ట్రిక్‌ను ఫాలో అవుతున్న రష్మిక మందన్న.. మరోసారి.. అలాంటి పనే చేశారు.
తన చేసిన ఆ పనితో.. కింగ్ నాగ్ ఫ్యాన్స్‌తో పాటే.. తన ఫ్యాన్స్‌ను .. మరికొంత మంది నెటిజన్స్‌ను ఫిదా చేసేశారు. క్రేజీ కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. పుష్ప1 అండ్ పుష్ప2 సినిమాలతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న.. తాజాగా కుబేర్ సినిమా చేస్తున్నారు. కింగ్ నాగ్, ధనుష్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక కూడా ఓ మంచి రోల్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 20 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌ను మొదలెట్టింది కుబేర టీం. అందుకు మొదటగా చెన్నైలో ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్‌లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్‌తో క్యాండిడ్ మూమెంట్స్‌ను పంచుకోవడం తనకు సంతోషానిచ్చిందంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాదు ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ఒక ఫోటో మాత్రం అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. నెట్టింట వైరల్ అవుతోంది. అదే కింగ్ నాగార్జున ఏదో చెబుతుంటే… ఆయాన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వినడం. ఈ ఫోటో కింగ్ అభిమానులకు తెగ నచ్చేస్తుంది. రష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ఈవెంట్ లో ఈ బ్యూటీ హైలెట్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడ్డంగా బుక్కైన మంగ్లీ.. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ మత్తు!

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
