వీడు మామూలోడు కాదు.. ఎదురుపడిన కోబ్రాను ఏం చేసాడంటే
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి గగుర్పాటును కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాముల్లో కోబ్రా ఒకటి. దాని ఒక చుక్క విషం.. నిమిషాల్లోనే ప్రాణం తీస్తుంది. సాధారణ పాముల కంటే కోబ్రా చాలా రెట్లు పెద్దది.. శక్తివంతమైంది.
దాన్ని నియంత్రించడం అందరికీ సాధ్యం కాదు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కోబ్రాని సెకన్లలో సులభంగా పట్టుకున్నాడు. వీడియో అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారికి వర్షాకాలంలో ఇళ్లల్లోకి పాములు రావడం కొత్తేమీ కాదు. తుపానులు, వరదలు వచ్చేటప్పుడు పాములు తమ నివాసాలను వదిలి పొడి, వెచ్చని, సురక్షిత ప్రదేశాలవైపు ప్రయాణిస్తాయి. అటువంటి సమయాల్లో మన ఇళ్లు వాటికి సహజమైన ఆశ్రయ కేంద్రాలుగా మారుతాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రావడం, పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి.. ప్రమాదకరమైన నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి శిక్షణ పొందిన పాములు పట్టే స్నేక్ క్యాచర్ కాడని తెలుస్తోంది. పామును బంధించడానికి బాటిల్‌తో వచ్చాడు. పాము తలను గట్టిగా పట్టుకుని చటుక్కున పామును బాటిల్ లోపలికి తోసాడు. వీడియో చూసిన వారు అతని ధైర్యానికి సలాం అంటున్నారు. అయితే ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
