AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Taraka Ratna: సోదరుడి భౌతికకాయం ముందు చెమర్చిన కళ్లతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

నందమూరి తారకరత్న ఇకలేరన్న వార్తతో సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో గత కొన్నాళ్లుగా బెంగుళూరులో చికిత్స పొందారు తారకరత్న. చికిత్స ఫలించక శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు తారకరత్న.

Nandamuri Taraka Ratna: సోదరుడి భౌతికకాయం ముందు చెమర్చిన కళ్లతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
Kalyan Ran - NTR
Ram Naramaneni
|

Updated on: Feb 19, 2023 | 10:54 AM

Share

నందమూరి కుటుంబంలో అంతులేని విషాదం. తారకరత్న ఇకలేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఇద్దరికీ సోదరుడి భౌతికకాయాన్ని చూసి కళ్లు చెమర్చాయి. ఆత్మీయుల్ని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసంటూ.. అభిమానులకు పదేపదే జాగ్రత్తలు చెప్పే జూనియర్‌ NTR ఇప్పుడు తారకరత్న మరణంతో మరింత డిస్ట్రబ్‌ అయినట్టు కనిపించారు. కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ NTR ఇద్దరూ చాలాసేపు మౌనంగానే ఉండిపోయారు. అటు.. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి దగ్గరి బంధువైన YCP ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. NTRతోను, కల్యాణ్‌రామ్‌తోను చాలాసేపు మాట్లాడారు.

బెంగళూరులో తారకరత్నకు ట్రీట్‌మెంట్‌ జరుగుతున్నప్పుడు NTR, కల్యాణ్‌రామ్‌తోపాటు విజయసాయిరెడ్డి కూడా వెళ్లి చూసొచ్చారు. కోలుకుంటాడనే ఆశించారు.. కానీ ఇలా జరిగేసరికి ఏ ఒక్కరూ కూడా తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌ శివారు శంకరపల్లిలోని మోకిల దగ్గర ఇంటిని చాలా ముచ్చటపడి కట్టించుకున్నారు తారకరత్న. ఇంటీరియర్‌ డిజైన్‌ మొదలు ప్రతిదీ తనకు నచ్చినట్టు, తన అభిరుచికి తగ్గట్టు ప్లాన్‌ చేసుకున్నారు. భార్య ముగ్గురు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో హార్ట్‌ ఎటాక్‌ రూపంలో మృత్యువు కబళించేసింది.

కోలుకుని తిరిగొస్తాడనుకున్నారు. మళ్లీ ఆ చిరునవ్వులు చూస్తామనుకున్నారు. చికిత్సకు స్పందిస్తాడని.. మిరాకిల్‌ జరుగుతుదందని ఎదురు చూశారు.. తారకరత్నను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపుతూ తారకరత్న కన్నుమూశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు