IPL 2023: అలాంటి వాటిని ప్రమోట్ చేయోద్దు.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్‌ విజ్ఞప్తి..

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీ (TSRTC MD) వీసీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా ఐపీఎల్ యాజమాన్యానికి కీలక అభ్యర్థనలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజల జీవితాలను నాశనం చేసే కొన్ని మోసపూరిత సంస్థలను పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవద్దని సూచించాడు.

IPL 2023: అలాంటి వాటిని ప్రమోట్ చేయోద్దు.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్‌ విజ్ఞప్తి..
Sajjanar
Follow us
Venkata Chari

|

Updated on: May 25, 2023 | 5:01 PM

సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీ (TSRTC MD) వీసీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా ఐపీఎల్ యాజమాన్యానికి కీలక అభ్యర్థనలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజల జీవితాలను నాశనం చేసే కొన్ని మోసపూరిత సంస్థలను పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవద్దని సూచించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ మేరకు ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. ఇందులో ఆ సంస్థ పేరును ప్రస్తావిస్తూ ఆయన ఐపీఎల్ యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి సంస్థలు ఐపీఎల్ లాంటి ప్రాంఛైజీలకు పార్ట్‌నర్స్‌గా ఉంటూ.. జనాలను మోసం చేస్తున్నాయి. కాబట్టి, ఇలాంటి సంస్థలను ప్రోత్సహించవద్దని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందంటూ సూచించాడు.

ఇంతకుముందు కూడా సజ్జనార్.. ఇలాంటి వాటిపై ఎన్నో అభ్యర్థనలు చేశారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దంటూ సూచించారు. అలాగే జనాలకు కూడా ఇలాంటి సంస్థల ప్రకటనలు, బంఫర్ ఆఫర్లు చూసి మోసపోవద్దంటూ తరచుగా సూచిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

‘హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుక‌ట్టు సంస్థలు అమాయ‌క‌పు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. #IPL కు అఫిషియ‌ల్ పార్ట్‌నర్‌గా ఉన్నామంటూ ప్రొడ‌క్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోస‌పూరిత సంస్థలను అఫిషియ‌ల్ పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం పున‌రాలోచించాలి. హెర్బల్ లైఫ్‌పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుని, మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి’ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..