AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కూల్ వెదర్.. వీకెండ్స్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న నగరవాసులు..

వేసవి సెలవులు ఎండింగ్‌కి వచ్చాయ్‌. వెదర్‌ కూల్‌గా ఉంటోంది. అందులోనూ వీకెండ్‌.. ఇంకేముందు బెస్ట్‌ హాలీడే స్పాట్‌గా నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ ఫస్ట్‌ ప్లేస్‌కి వచ్చేసింది. గత రికార్డులను బ్రేక్‌ చేసింది.మొన్నటివరకు భానుడి భగభగలతో బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయిన జనం.. ఇప్పుడు వెదర్‌ మారిపోవడంతో బయటకొచ్చి చిల్‌ అవుతున్నారు. వీకెండ్‌లో బెస్ట్‌ హాలీడే స్పాట్‌ను ఫిక్స్‌ చేసుకుంటున్నారు.

Hyderabad: కూల్ వెదర్.. వీకెండ్స్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న నగరవాసులు..
Hyderabad Zoo Park
Srikar T
|

Updated on: May 26, 2024 | 9:37 PM

Share

వేసవి సెలవులు ఎండింగ్‌కి వచ్చాయ్‌. వెదర్‌ కూల్‌గా ఉంటోంది. అందులోనూ వీకెండ్‌.. ఇంకేముందు బెస్ట్‌ హాలీడే స్పాట్‌గా నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ ఫస్ట్‌ ప్లేస్‌కి వచ్చేసింది. గత రికార్డులను బ్రేక్‌ చేసింది.మొన్నటివరకు భానుడి భగభగలతో బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయిన జనం.. ఇప్పుడు వెదర్‌ మారిపోవడంతో బయటకొచ్చి చిల్‌ అవుతున్నారు. వీకెండ్‌లో బెస్ట్‌ హాలీడే స్పాట్‌ను ఫిక్స్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌కు రద్దీ పెరిగింది. ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబ సమేతంగా జూకు క్యూ కడుతున్నారు. పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. మరికొందరైతే చెట్ల కిందే కార్పెట్లు వేసుకొని మధ్యాహ్నం ఓ కునుకు తీస్తున్నారు. దీంతో మునుపెన్నడూ చూడని రష్‌ నెహ్రూ జూపార్క్‌లో కనిపిస్తోంది. ఎంట్రీ టికెట్‌ కోసం క్యూ లైన్‌లో వెయిట్‌ చేయాల్సిన పరిస్థితొచ్చింది.

వాతావరణం చల్లబడటం, పిల్లలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నెహ్రూ జూపార్క్‌కు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 8 వేల మందికిపైగా వచ్చే జూపార్క్‌కు ఆదివారం ఒక్కరోజే 30వేల మంది రావడం సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే విదేశీలు సంఖ్య గట్టిగానే ఉంది. అంతేకాదు ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌, బర్త్‌డే ఫోటో షూట్స్‌ కోసం కూడా జూ పార్క్‌నే ప్రధాన స్పాట్‎లుగా ఎంచుకోవడం కూడా భారీ రద్దీకి కారణంగా కనిపిస్తోంది. సందర్శకుల రద్దీ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది సిబ్బంది. సందర్శకుల తాకిడి గట్టిగా ఉండటంతో టికెట్‌ కౌంటర్ల సంఖ్య పెంచారు. కౌంటర్ల దగ్గర ఎండ తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంచినీళ్లను సైతం అందిస్తున్నారు. మొత్తంగా.. ఇలాంటి రద్దీని మునుపెన్నడూ చూడలేదంటున్నారు జూ పార్క్‌ సిబ్బంది. ఈ వారం రోజుల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?