AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Food: హోటల్‌ ఫుడ్‌ తింటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా? తిన్నారో.. పోయారే!

వీకెండ్‌ కదా అని.. సరదాగా ఫ్యామిలీతో ఓమాంచి ఫ్యామిలీ రెస్టారెంట్‌కి డిన్నర్‌కు వెళ్దామని ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త.. అలాంటి ఆలోచన చేశారో.. తిన్నతిండికి రెస్టారెంట్‌లో కాదు, దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో లక్షలబిల్లు కడుతారు. పైన పటారం లోనలొటారం అన్నట్టుగా మారిన ఫుడ్‌సెంటర్లలో... మనం ఎంత డేంజరస్‌ ఫుడ్‌ తింటున్నామనే విషయం.. తాజాగా అధికారుల దాడుల్లో చూసింది. ఈ విషాహారం తిని ఎంతమంది అనారోగ్యాల పాలవుతున్నారో లెక్కేలేదు. మరి, దీనికి కారణం ఎవరు? నిర్లక్ష్యం ఎవరిది?

Dangerous Food: హోటల్‌ ఫుడ్‌ తింటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా? తిన్నారో.. పోయారే!
Weekend Hour Debate
Ram Naramaneni
|

Updated on: May 26, 2024 | 7:06 PM

Share

ఏం తినేటట్టు.. ఏం కొనేటట్టు లేదు… ఇదేదో ఆకాశాన్నంటిన నిత్యావసరధరలను ఉద్దేశించి చెబుతున్న మాట కాదు. జిగేల్‌ జిగేల్‌మనే లైట్లతో వెలిగిపోతున్న బడాబడా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌సెంటర్లలో జరుగుతున్న కల్తీ కహానీ. ఈ మధ్య ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న వరుస రైడ్స్‌లో.. ఫుడ్‌లవర్స్‌కే కాదు, సాధారణ జనాలకూ దిమ్మ తిరిగిపోయేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. చాలా హోటెల్స్‌లో కుళ్లిన పదార్థాలతో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారని నిర్ధారించారు తనిఖీ అధికారులు. కనీస శుభ్రత పాటించకుండా… రోజుల తరబడి స్టోర్‌చేసిన మాంసాన్ని .. వేడివేడిగా వడ్డిస్తూ.. జనాల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్టు తేల్చారు. ఇప్పటికే పలువురు బాధితులు.. తమకు అనారోగ్య స్థితికి కారణమైన హోటెల్స్‌పై కేసులు కూడా నమోదు చేశారు.

గల్లీకో హోటెల్‌… రోడ్డుకో రెస్టారెంట్‌… విచ్చలవిడిగా వెలుస్తున్న ఫుడ్‌సెంటర్లు.. దీంతో విపరీతమైన కాంపిటీషన్‌ ఏర్పడింది. ఎలాగైనా సక్సెస్‌ కావాలని.. లాభాలబాట పట్టాలని.. కొన్ని హోటెల్స్‌ వికృతచేష్టలకు దిగుతున్నాయి. ఆహారం మిగిలితే పారేయకుండా.. స్టోరేజ్‌చేసి తర్వాతి రోజుకూడా కస్టమర్లకు వడ్డిస్తున్నారు. వాడిన నూనెలనే మళ్లీమళ్లీ వాడుతూ.. ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. అయితే, ఆలస్యంగా మేల్కొన్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు… ఇప్పుడు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. హోటెల్సన్ననీ FSSI రూల్స్‌ పాటించాలని చెబుతున్నారు.

కుళ్లిన ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నవారు.. ఆస్పత్రులకు భారీ సంఖ్యలో వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రత, ప్రాసెస్‌ ఫుడ్‌, స్టోర్డ్‌ ఫుడ్‌ల కారణంగానే.. కడుపునొప్పి, లూస్‌ మోషన్స్‌.. మలంలో రక్తం రావడం.. నీరసించిపోవడం.. వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రైడ్స్‌తో హైదరాబాద్‌లోని రెస్టారెంట్ల నిర్వాహకులంతా అప్రమత్తమయ్యారు. హోటెల్స్‌ యజమానులందరూ… FSSI రూల్స్‌ పాటించాలని సూచిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి రైడ్స్ చాలానే జరిగాయి. కానీ, హోటెల్స్‌లో జరుగుతున్న ఈ కల్తీ దందా తగ్గలేదు. లంచాలకు మరిగిన కొందరు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్లే ఈపరిస్థితులనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి, ఈసారి పంథా మార్చిన అధికారులు.. పకడ్బందీగా చర్యలు తీసుకుంటారో? పాతకథే పునరావృతమవుతుందో చూడాలి.