AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Steel Bridge: తీరనున్న హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు.. ఉక్కువంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్‌కు.. ఇవాళ మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు.

Hyderabad Steel Bridge: తీరనున్న హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు.. ఉక్కువంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
Minister KTR
Shaik Madar Saheb
|

Updated on: Aug 19, 2023 | 11:38 AM

Share

హైదరాబాద్‌కు.. ఇవాళ మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. స్టీల్ బ్రిడ్జి నిర్మించిన మార్గంలో రోజు లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. వాహనాల డెన్సిటీ ఎక్కువ ఉండటంతో పాటు జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ టెన్షన్ షరామాములే. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే అరగంట జర్నీలో 25 నిమిషాల సమయం ఆదా కానుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్‌ఆర్‌డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టగా.., ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. VST ఫ్లై ఓవర్‌ 36వది. అయితే, వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీ, ఒక కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్‌ఆర్‌ మెదక్‌ రోడ్‌ ఉంది. 20వ ఫ్లై ఓవర్‌గా ఈ స్టీల్‌ బ్రిడ్జి నిలవనుంది. SRDPలో ఫ్లై ఓవర్‌ అవసరాన్ని బట్టి స్టీల్‌ను వినియోగించారు. బంజారాహిల్స్‌ శ్మశాన వాటిక, మల్కం చెరువు సమీపంలో చేపట్టిన వంతెనకు కొంత మేరలో స్టీల్‌ వినియోగించగా.. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు 20 మె ట్రిక్‌ టన్నుల ఉక్కును వాడారు. దక్షిణాదిన మొదటి పొడవైన వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీ చరిత్రలో భూసేకరణ లే కుండానే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. హైదరాబాద్‌లో మై ట్రో రైల్‌ మార్గం మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ కావడం మరో విశేషం. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది.

ఉక్కువంతెన ప్రారంభోత్సవం వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..