HSPA : స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హెచ్ఎస్పీఏ ఏమన్నదంటే..!

జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం

HSPA : స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హెచ్ఎస్పీఏ ఏమన్నదంటే..!
Schools Reopen
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 19, 2021 | 7:43 PM

Schools Reopen in Telangana : జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ‌ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం వెల్లడించింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ‌ఎత్తివేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, జూలై ఫస్ట్ నుంచి భౌతిక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. “థర్డ్ వేవ్‌ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ప్రభావం చూపిస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో భౌతిక తరగతులను నిర్వహించడం ఎంత మాత్రం మంచిది కాదని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని HSPA ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.” అని ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ భౌతిక దూరాన్ని పాటించటం , శానిటేషన్ చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటి నియమాలను పాటించటం సాధ్యం కాదు.. అందువల్ల భౌతిక తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం మరికొంత సమయాన్ని తీసుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ స్కూల్స్ రీ ఓపెన్ పై ఒక డిసిషన్ తీసుకోవాలని హెచ్ఎస్పీఏ ప్రతినిధి వెంకట్ సాయినాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

పాఠశాలలు తెరిచే విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ముందు పేరెంట్స్ కమిటీలతో చర్చించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి భయాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని హెచ్ఎస్పీఏ కోరుకుంటుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

Read also : Veeranki : భార్య-భర్త గొడవ : వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన ఆ భర్త ఏం చేశాడంటే.. !

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే