Hyderabad: ఒమిక్రాన్ అంటే భయం లేదు.. ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కే లేదు.. 2వేల మందితో ప్రిజమ్‌ పబ్‌ ఈవెంట్

కోవిడ్‌ రూల్స్‌ అంటే లెక్కలేదు.. ప్రభుత్వ ఆదేశాలంటే పట్టింపుల్లేవ్‌.. అదే బరితెగింపు.. అదే విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నాయి కొన్ని పబ్‌లు.

Hyderabad: ఒమిక్రాన్ అంటే భయం లేదు.. ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కే లేదు.. 2వేల మందితో ప్రిజమ్‌ పబ్‌ ఈవెంట్
Prism Pub
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2021 | 12:13 PM

కోవిడ్‌ రూల్స్‌ అంటే లెక్కలేదు.. ప్రభుత్వ ఆదేశాలంటే పట్టింపుల్లేవ్‌.. అదే బరితెగింపు.. అదే విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నాయి కొన్ని పబ్‌లు. స్పెషల్ ఈవెంట్‌లకు పర్మిషన్ లేదని చెప్పినా ఖాతరు చేయడం లేదు. ప్రిజమ్‌ పబ్‌లో రాత్రి స్పెషల్ ఈవెంట్‌ కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్‌కి దాదాపు 2వేల మంది హాజరయ్యారు.

ఫోటోలో క్లియర్‌ కట్‌గా కనిపిస్తోంది. జనమంతా ఎలా గుమిగూడారో. మసక మసక చీకట్లు.. చెవులు చిల్లులు పడే డీజే సౌండ్స్‌.. కలర్‌ఫుల్‌ కాక్‌టెయిల్‌తో మత్తులో మునిగిపోయారంతా. ఓమిక్రాన్‌ కలకలంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మాస్‌ గ్యాదరింగ్స్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచించింది. కానీ ప్రిజమ్‌ పబ్‌లో జరిగిన ఈవెంట్‌లో అవేవీ కనిపించలేదు. వందల మంది ఒకేచోట కలిసి మత్తులో తేలియాడారు. కనీసం పోలీసుల అనుమతి కూడా తీసుకోలేదు.

ప్రిజమ్‌ పబ్‌లో జరిగిన ఈవెంట్‌కి ప్రముఖ సింగర్‌ బెన్ భూమర్‌ అటెండ్‌ అయ్యారు. ఆట పాటలతో హోరెత్తించారు. ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన పబ్‌లు.. గల్లీ గల్లీలో లొల్లి చేస్తున్నాయి. ఆ న్యూసెన్స్‌ భరించలేక అక్కడున్న వాళ్లంతా రోడ్డెక్కడం.. ఆపై కోర్టుకెళ్లడం కూడా చూస్తున్నాం. అయినా పబ్‌లు డోంట్‌కేర్ అంటూ మిడ్‌నైట్‌ హంగామాను కంటిన్యూ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసినందుకు ప్రిజమ్ పబ్ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: మార్కెట్లో కొత్త అమ్మవారు.. దర్శిస్తే సకల అరిష్టాలు పోతాయట.. పోటెత్తుతున్న జనం

Anasuya: ‘అనసూయ నా చేతిని టచ్ చేసింది’.. అభిమాని సంబరం చూడండి