AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drunken Drive: అమాయకుల ప్రాణాలు తీస్తున్న తాగుబోతులు.. మొయినాబాద్ ప్రమాదంలో మరొకరు మృతి

Drunkards killing innocent people: హైదరాబాద్‌ మహానగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను

Drunken Drive: అమాయకుల ప్రాణాలు తీస్తున్న తాగుబోతులు.. మొయినాబాద్ ప్రమాదంలో మరొకరు మృతి
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Dec 27, 2021 | 12:19 PM

Share

Drunkards killing innocent people: హైదరాబాద్‌ మహానగరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు. నిన్న మొయినాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరో యువతి సౌమ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆదివారం అతివేగంగా వచ్చిన కారు.. స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ప్రేమిక మృతి చెందింది. సౌమ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కానీ మృత్యువుతో పోరాడి.. సౌమ్య సోమవారం ఉదయం ప్రాణాలు విడిచింది. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కార్ డ్రైవ్ చేసిన సంపత్ రెడ్డి కి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా.. 228 ఆల్కహాల్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. దీంతో మద్యం మత్తులో కారు నడిపిన సంపత్ రెడ్డిపై 304 పార్ట్2 కింద పోలీసు అధికారులు కేసు నమోదు చేసారు. సంపత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్

Viral Video: తగ్గేదెలే.. సింహాలకు చుక్కలు చూపించిన ఎద్దు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో