SRH Vs MI: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా.? ఫ్యాన్స్.! ఇదిగో ఇవి తెలుసుకోండి..
మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య హై-వోల్టేజ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇది 8వ మ్యాచ్ కాగా.. ఇరు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు ముగించింది. ఈ తరుణంలో కొన్ని సూచనలు ఇచ్చారు పోలీసులు. అవేంటో చూసేద్దామా..

మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య హై-వోల్టేజ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇది 8వ మ్యాచ్ కాగా.. ఇరు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ అన్ని ఏర్పాట్లు ముగించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక తమ అభిమాన ఆటగాళ్లను, ఆటను చూసేందుకు భాగ్యనగర వాసులు రెడీ అయ్యారు. మరి మీరు కూడా ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నట్లయితే..? ఇవిగో పోలీసులు ఇచ్చిన సూచనలు ఏంటో చూసేయండి..
ఈ సీజన్‌లో హైదరాబాద్ వేదికగా జరిగే మొదటి మ్యాచ్ ఇది. నలభై వేల సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఉప్పల్ స్టేడియం చుట్టూ 4 వేల కారులు, 6 వేల బైక్‌లకు పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ మ్యాచ్‌కు మూడు వేల మంది పోలీసులు బందోబస్తు చేయనున్నారు. సాయంత్రం 7.30కి మ్యాచ్ స్టార్ట్ కానుండగా.. 4 గంటల నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతి ఇస్తారు. కానీ లోపలికి వచ్చే అభిమానులకు పోలీసులు కొన్ని సూచనలు ఇచ్చారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు కొన్ని ఆంక్షలు విధించారు ఖాకీలు. మ్యాచ్ కోసం వచ్చేటప్పుడు కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదని పేర్కొన్నారు. బ్యాగ్, ల్యాప్‌టాప్, ఆల్కహాల్, గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్, మారణాయుధాలు, కెమెరా, పేలుడు పదార్థాలు, బాణసంచా, పెట్స్, తినే వస్తువులు, సిగరెట్, లెటర్స్, బైనాక్యులర్, నైఫ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి స్టేడియంకు తీసుకురావద్దని భాగ్యనగర వాసులు, క్రికెట్ ఫ్యాన్స్‌కు స్ట్రిక్ట్ చెప్పారు పోలీసులు.




