VH Met CM Revanth: మెట్టు దిగిన విహెచ్.. సీఎంతో భేటీ.. అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా
తెలంగాణ రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య అంతర్గత విబేధాలు లేవని నిరూపించేందుకు ప్రయత్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కలుసుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య అంతర్గత విబేధాలు లేవని నిరూపించేందుకు ప్రయత్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కలుసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో టికెట్ అశించ భంగపడ్డ విహెచ్ గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏకంగా ఇటీవల మీడియా ముందు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ లో విహెచ్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల వీహెచ్ ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. తనకు దక్కే అవకాశం లేదని తెలుసుకున్న వీహెచ్ అలకబూనారు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యి చర్చించారు. బుజ్జగింపులు, సంప్రదింపుల తర్వాత బుధవారం వి.హనుమంతరావును సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు మహేశ్ కుమార్ గౌడ్. మర్యాదపూర్వకంగా వీహెచ్ పలకరించిన సీఎం రేవంత్.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసాఇచ్చారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు.
ఇదిలావుంటే, ఎంపీ టికెట్ అశించిన వీహెచ్ ఇటీవల సీఎం రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఒక సైడే వింటున్నారు…రెండో సైడ్ కూడా వినాలంటూ గుస్సా అయ్యారు. భజనపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆలోచనలో మార్పు రావాలన్నారు. సీఎం సమయం ఇవ్వడం లేదని, ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానిస్తున్నారు, కానీ పార్టీలోని సీనియర్లను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని తగ్గించుకుంటున్నారన్నదే తన ఆవేదన అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ఎంపీ టిక్కెట్లు ఇచ్చి.. నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే వి.హనుమంతరావును దగ్గరకు పిలిపించుకుని సముదాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




