AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. రెగ్యులర్ కమర్షియల్ విమానాల్లో రేవంత్ రెడ్డి ప్రయాణం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని భావించడమే కాకుండా ఆచరించి చూపిస్తున్నారు. అనవసర ఖర్చులతో రాష్ట్ర ఖజానాకు అదనపు భారం తీసుకురావద్దని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఔరా అనిపిస్తున్నారు.

Revanth Reddy: ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. రెగ్యులర్ కమర్షియల్ విమానాల్లో రేవంత్ రెడ్డి ప్రయాణం..!
Revanth Reddy Fligh Journey
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 1:17 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని భావించడమే కాకుండా ఆచరించి చూపిస్తున్నారు. అనవసర ఖర్చులతో రాష్ట్ర ఖజానాకు అదనపు భారం తీసుకురావద్దని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఔరా అనిపిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు లేదా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పద్ధతికి స్వస్తి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కొన్ని సార్లు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత సాధారణ విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణానికి, మహారాష్ట్ర రాజధాని ముంబైకి సాధారణ విమానంలోనే ప్రయాణించారు.

గత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారిక కార్యక్రమాలకైనా లేదా వ్యక్తిగత అవసరాలకైన ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేవారు. దాంతో ఆయా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అలాంటి విమర్శలకు తావు లేకుండా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పాలకుడు ఎంత నిరాడంబరంగా ఉంటే ప్రజల్లో అంత మంచి పేరు వస్తుందని, తద్వారా అది పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..