Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు పీఎ అరెస్ట్..? క్లారిటీ ఇదిగో..!
సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహరంలో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అందులో హరీశ్ రావు పీఏ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యాలయం వెంటనే రియాక్ట్ అయ్యింది. అయితే ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై హరీశ్ రావు కార్యాలయం స్పందించింది.

సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహరంలో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే అందులో హరీశ్ రావు పీఏ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యాలయం వెంటనే రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై హరీశ్ రావు కార్యాలయం స్పందించి ప్రెస్ నోట్ విడుదల చేసింది. నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు పీఏ కాదని, అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసేవాడని క్లారిటీ ఇచ్చింది.
ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి ఆఫీసు మరుసటి రోజు 06-12-2023 రోజున మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు గారి కార్యాలయంకి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా హరీశ్ రావు కార్యాలయం క్లారిటీ ఇచ్చింది.
అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని కార్యాలయం ఆ ప్రెస్ నోట్ లో వెల్లడించింది. దీనిపై వెంటనే నరేష్ అనే వ్యక్తిపై 17-12-2023 నాడు, నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఆ వ్యక్తితో హరీశ్ రావు గారికి గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కార్యాలయం తెలిపింది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరమంటూ వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నాం ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.



