Hyderabad: నడక ప్రాధాన్యత తెలిపేలా ఓజోన్ హాస్పిటల్స్ 5కే రన్.. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా.
శారీరక శ్రమ తగ్గడంతో చాలా మందిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడుతోన్న వారు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నడక ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని తెలిసినా బద్దకంతో కొందరు, సమయం లేక మరికొందరు నడకను పూర్తిగా..
శారీరక శ్రమ తగ్గడంతో చాలా మందిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడుతోన్న వారు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నడక ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని తెలిసినా బద్దకంతో కొందరు, సమయం లేక మరికొందరు నడకను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నడక ప్రాముఖ్యతను. నడక వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో హైదరాద్‌లోని కొత్త పేట ఓజోన్ ఆసుపత్రి యాజమాన్యం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.
కొత్త పేట ఓజోన్ ఆసుపత్రుల యాజమాన్యం ఆద్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి ఆరోగ్యానికి నడక ప్రాధాన్యత పై అవగాహన కల్పించేందుకు 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ ఎల్బీ నగర్ డిసీపీ శ్రిమతి బి. సాయి శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నడక ఆరోగ్యానికి ప్రధానమన్నారు. ఉదయం, సాయంత్రం నడక ఆరోగ్యానికి ఉపకరిస్తుందని తెలిపారు.
ఇక 5K వాక్ అన్ని వయసుల ప్రజల్లో శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి ఉద్దేశించిందని డైరెక్టర్లు జనరల్ ఫిజీషియన్ డా. ఇంద్రసేన రెడ్డి, సీఓఓ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 5K వాక్ కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్స్ నుంచి ప్రారంభమై ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వరకు కొనసాగింది. వాక్ లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..