Home Guard Ravinder: హోంగార్డు రవీందర్ మృతి.. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
Home Guard Ravinder Dies: ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హోంగార్డు రవీందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రగాయాల పాలై మూడు రోజులుగా చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మరణించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రవీందర్ డీఆర్డీఓ అపోలోలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.

Home Guard Ravinder Dies: ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హోంగార్డు రవీందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తీవ్రగాయాల పాలై మూడు రోజులుగా చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మరణించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రవీందర్ డీఆర్డీఓ అపోలోలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. మూడు రోజుల క్రితం రవీందర్ హోంగార్డులను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని.. పోలీసులతో సమానంగా చూడాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. తీవ్రగాయాలైన రవీందర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు కూడా దృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉస్మానియా పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లోకల్ ట్రాఫిక్ PSలో హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్.. మూడు రోజుల క్రితం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఆత్మహత్యాయత్నం చేశారు. రవీందర్‌కి రెండు నెలల నుంచి జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం.. పై అధికారికి ఫోన్ చేస్తే.. 10వ తేదీ వరకు జీతం రాదని చెప్పడంతో రవీందర్ మనస్తాపానికి గురై.. గోషామహల్ హోంగార్డు హెడ్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అయితే, రవీందర్ ఆత్మహత్యాయత్నం తెలంగాణ హోంగార్డులను ఆందోళన బాట పట్టించింది. తమను పర్మినెంట్ చేయాలని, పోలీసులతో సమానంగా చూడాలంటూ హోంగార్డులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. రవీందర్ ఆత్మహత్యాయత్నంతో హోంగార్డు అసోసియేషన్ జేఏసీ ఆందోళన బాట పట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 16 వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది.
లైవ్ వీడియో..
తమను పర్మినెంట్ చేయాలని ఉద్యమిస్తున్న హోంగార్డులకు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గురువారం పరామర్శించారు.. హోంగార్డులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని, శ్రమ దోపిడి ఎక్కువ అయిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆత్మహత్యలు వద్దు.. పోరాడి సాధించుకుందాం..
హోంగార్డ్ రవీందర్ మృతి పట్ల కిషన్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని.. పోరాడి సాధించుకుందాం.. అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మహత్యలు వద్దంటూ ఉద్యోగులను కోరారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ హత్యేనంటూ కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




