Telangana: రవీందర్ ఆత్మహత్యాయత్నం.. హోంగార్డుల ఆందోళన బాట.. పర్మనెంట్ చేయాలని డిమాండ్..
రవీందర్ ఆత్మహత్యాయత్నంతో ఆందోళన బాట పట్టిన హోంగార్డులకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి. వాళ్లకు మద్దతు ఇస్తున్నాయి. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆత్మహత్యాయత్నం చేసి.. హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయన పరామర్శించారు. హోంగార్డులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించేవరకు..

Hyderabad: రవీందర్ ఆత్మహత్యా యత్నం.. హోంగార్డులను ఆందోళన బాట పట్టించింది. తమను పర్మనెంట్ చేయాలని, పోలీసులతో సమానంగా చూడాలంటూ ఉద్యమించేలా చేసింది. వాళ్ల ఆందోళనకు నేతలు మద్దతు ఇస్తున్నారు. అయితే ఆత్మహత్యా యత్నాలు చేయకుండా శాంతియుతంగా పోరాడాలన్నారు టీ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.
రవీందర్ ఆత్మహత్యాయత్నంతో ఆందోళన బాట పట్టిన హోంగార్డులకు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి. వాళ్లకు మద్దతు ఇస్తున్నాయి. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆత్మహత్యాయత్నం చేసి.. హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయన పరామర్శించారు. హోంగార్డులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించేవరకు శాంతియుతంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు కిషన్‌రెడ్డి.
హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడీ జరుగుతోంది : Kishan Reddy – TV9 #KishanReddy #HomeGuardEmployee #tv9telugu pic.twitter.com/SwRFdEt676
— TV9 Telugu (@TV9Telugu) September 7, 2023
రెండు రోజుల క్రితం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. లోకల్ ట్రాఫిక్ PSలో హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్‌కి రెండు నెలల నుంచి జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పై అధికారికి ఫోన్ చేస్తే.. 10వ తేదీ వరకు జీతం రాదని చెప్పడంతో రవీందర్ మనస్తాపానికి గురయ్యాడు. గోషామహల్ హోంగార్డు హెడ్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
Visited Home Guard Ravinder garu at Apollo Hospital, DRDO, in Hyderabad today. Met with his family and inquired about his health condition.
The self-immolation of Home Guard for delay in salaries is a result of KCR’s unfulfilled promise of addressing their issues including… pic.twitter.com/CDrirBUFtG
— G Kishan Reddy (@kishanreddybjp) September 7, 2023
ఈ నెల 16 వరకు విధుల బహిష్కరణకు హోంగార్డ్ అసోసియేషన్ జేఏసీ పిలుపునిచ్చింది. తమను పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. రవీందర్ ఆత్మహత్యా యత్నంతో అది ఆందోళన రూపం దాల్చింది. దీంతో రాజకీయ పార్టీలు హోంగార్డుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
