Hyderabad: మహిళలు ఇది తెలుసుకుంటే మంచిది.. కొన్నారో ఇక కాటికే..!
కాదేది కల్తీకి కనర్హం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ మధ్యకాలంలో పాల నుంచి పాల పొడి వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు మహిళలు ఎంతగానో ఇష్టపడే మెహందీపై పడింది వారి కన్ను. ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపిన మెహందీని తయారు చేసి..

హైదరాబాద్‌లో ఎటు చూసినా కల్తీ.. ఏది చూసినా నకిలీ మయం అయిపోయింది. పిల్లలు తాగే పాల దగ్గరి నుంచి దేన్నీ విడిచిపెట్టడం లేదు కల్తీ రాయుళ్లు. ఓ విధంగా చెప్పాలంటే కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. తాజాగా టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ మెహందీ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మెహందీ తయారు చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని భారీగా డూప్లికేట్ మెహందీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగుచూశాయి. చేతులు, కాళ్లకు పెట్టుకునే ఈ మెహందీలో రంగు రావడం కోసం ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నట్టు గుర్తించారు.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
ఇలాంటి మెహందీని చేతులు, కాళ్లకు పెట్టుకుంటే చర్మం కాలిపోవడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెహందీ అంటేనే మహిళలు భయపడే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కొనేటప్పుడు ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో తెలియక గందరగోళం ఏర్పడింది. ఇప్పటివరకు నీళ్లు, మాంసం, బియ్యం, నిత్యావసరాల్లో కల్తీకి పాల్పడుతున్న కేటుగాళ్ల కన్ను ఇప్పుడు మెహందీపై పడటంతో మహిళలంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రంజాన్ పండుగ సీజన్ కావడంతో మహిళలంతా మెహందీ పెట్టుకునేందుకు మక్కువ చూపుతుంటారు. ఇలాంటి సమయంలో ఇలా కెమికల్స్ కలిపిన మెహందీ మార్కెట్‌లోకి రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అందం, అలంకరణ సంగతి అటుంచితే చేతులు, కాళ్లు కాలిపోతే పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇలాంటి నకిలీ కేంద్రాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా