నవమాసాలు మోసి ఎందుకమ్మా ఇలా చేశావ్.. పెద్దైతే ఖర్చులని 15 రోజుల చిన్నారిని తల్లి ఏం చేసిందంటే..
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొకటి ఉండదు. కానీ.. ప్రస్తుతం తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోయింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే బిడ్డల పాలిట యమపాశంగా మారుతోంది.. మానవత్వాన్ని మరిచి 14 రోజుల బిడ్డను బకట్‌లో ముంచి చంపేసిందో తల్లీ.. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది..

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొకటి ఉండదు. కానీ.. ప్రస్తుతం తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోయింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే బిడ్డల పాలిట యమపాశంగా మారుతోంది.. మానవత్వాన్ని మరిచి 14 రోజుల బిడ్డను బకట్‌లో ముంచి చంపేసిందో తల్లీ.. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.. రెండు రోజుల క్రితం14 రోజుల పాప అనుమానాస్పద మృతి స్థితిలో మృతిచెందింది.. బకెట్లోని నీటిలో పడి ఉంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఎట్టకేలకు ఛేదించారు. ఆ పాపను చంపింది తల్లేనని పోలీసులు తేల్చారు. బిడ్డను నీళ్ల బకెట్లో ముంచి ఊపిరాడకుండా చంపినట్లు తల్లి విజ్జి ఒప్పుకుంది. 14 రోజుల క్రితం పాపకు విజ్జి జన్మనిచ్చింది. భర్త మనికి రెండు కిడ్నీలు పాడవడంతో కుటుంబ పోషణ భారమైంది. పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు భరించలేమని ఆర్థిక భారంతో బిడ్డను చంపినట్లు విజ్జి పోలీసుల విచారణలో ఒప్పుకుంది.
తమిళనాడుకి చెందిన మనీ అతని భార్య విజ్జీతో మైలార్దేవుపల్లి PS పరిధిలోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మనీ జయ అండ్ కోలో పనిచేస్తున్నాడు.. ఈ క్రమంలోనే మనీకి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.
దీంతో గత కొన్నాళ్లుగా మనీ, విజ్జీ దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించిన తల్లి.. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్‌రూమ్‌లోని నీటి బకెట్‌లో పడేసి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..