AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వేసిన తాళం వేసినట్టే.. ఉంచి కేజీ బంగారం కాజేసిన కేటుగాళ్లు.. ఎలా అంటే?

హైదరాబాద్‌లో మరో భారీ దొంగతనం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలోకి అర్థరాత్రి చొరబడిన కొందరు దుండగులు.. సుమారు కేజీ మేర బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: వేసిన తాళం వేసినట్టే.. ఉంచి కేజీ బంగారం కాజేసిన కేటుగాళ్లు.. ఎలా అంటే?
Hyderabad Crime News
Anand T
|

Updated on: Jul 20, 2026 | 2:07 PM

Share

హైదరాబాద్‌లో మరో భారీ దొంగతనం కలకలం రేపింది. బంజారాహిల్స్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్ కార్యాలయంలోకి చొరబడిన కొందరు దుండగులు.. సుమారు కేజీ మేర బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారి ఎక్స్‌పోర్ట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి కిటికీని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకుడు తెలిపారు.

మిస్సైన ఆభరణాలలో 7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు కలిపి మొత్తం 1,028 గ్రాముల నగలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నగలను డైమండ్‌ ఫిక్సింగ్‌ కోసం లాకర్‌లో దాచామని.. అంతలోనే దుండగులు వాటిని అపహరించుకుపోయినట్టు బాధితుడు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us