September 04, 2026
venkata chari
ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగించడం సాధారణమే. అయితే వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ ఉంటే, వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండటం మంచిది. లేదంటే ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి మరికొరికి వ్యాపించే అవకాశం ఉంటుంది.
తడిగా ఉండే వస్తువులపై సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ బార్ సబ్బును కుటుంబ సభ్యులు పంచుకోవడం వల్ల త్వరగా అనారోగ్యం పాలయ్యే ఛాన్స్ ఉంటుంది.
అమెరికా FDA, CDC ప్రకారం బార్ లేదా లిక్విడ్ సబ్బు రెండూ చేతులపై ఉన్న సూక్ష్మజీవులను తొలగించడంలో పనిచేస్తాయి. అయితే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఉపయోగించే వ్యక్తిగత వస్తువులను ఇతరులు పంచుకోకుండా ఉండాలి.
ఇంట్లో ఎవరికైనా చర్మంపై ఇన్ఫెక్షన్, పుండ్లు లేదా ఇతర అంటువ్యాధి ఉంటే వ్యక్తిగత వస్తువుల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ కూడా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు తువ్వాళ్లు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తోంది.
అయితే సబ్బు తప్పనిసరిగా ద్రవ రూపంలోనే ఉండాలనే నిబంధన లేదు. CDC ప్రకారం బార్ సబ్బు, లిక్విడ్ సబ్బు రెండూ చేతుల పరిశుభ్రతకు ఉపయోగపడతాయి. సబ్బుతో చేతులను కనీసం 20 సెకన్లు రుద్ది, శుభ్రమైన నీటితో కడుక్కోవడం ముఖ్యం.
కుటుంబంలో ఒకే సబ్బు వాడుతున్నారనే కారణంతోనే వ్యాధి వస్తుందని భావించాల్సిన అవసరం లేదు. సాధారణ సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గిస్తుంది.
అయితే సబ్బును శుభ్రంగా, పొడిగా ఉంచడం, చేతులను సరిగ్గా కడుక్కోవడం, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వ్యక్తిగత వస్తువులను వేరు చేయడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.