నిమ్స్‌లో పేద యువకుడికి పునర్జన్మ.. 3D మ్యాపింగ్‌తో అరుదైన ఉచిత గుండె శస్త్రచికిత్స!
30 ఏళ్ల దినసరి కూలీకి అరుదైన గుండె లయ సమస్య (Ventricular Premature Complexes) తలెత్తింది. లక్షల ఖర్చు భరించలేని అతడు నిమ్స్‌ను ఆశ్రయించాడు. నిమ్స్ వైద్యులు 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ ఉపయోగించి, అత్యంత సంక్లిష్టమైన రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కరోనరీ ధమని సమీపంలోని ప్రమాదకర కేంద్రాన్ని నిర్వీర్యం చేసి, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ప్రాణరక్షక చికిత్సను అందించారు.

పేదరికం ఒకవైపు, ప్రాణాల మీదకు తెచ్చే అరుదైన గుండె సమస్య మరొక వైపు.. తెలంగాణకు చెందిన ఓ 30 ఏళ్ల దినసరి కూలీ జీవితంలో తలెత్తిన పెద్ద సంక్షోభమిది. రెండేళ్ల క్రితం కష్టం చేసి పనిచేస్తున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆయాసం, ఛాతీలో తీవ్రమైన నొప్పి ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదిస్తే ఈసీజీ, గుండె ఎంఆర్‌ఐ పరీక్షలు చేసి వెంటిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ అనే అరుదైన గుండె లయ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడ రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును భరించే శక్తి ఆ నిరుపేద కార్మికుడికి లేకపోయింది. చివరికి దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ఆశ్రయించాడు.
నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ. సాయి సతీష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి హోల్టర్ మానిటరింగ్ పరీక్ష నిర్వహించారు. దీంతో అతని గుండెలో ఏకంగా 57 శాతం అసాధారణ విపరీత హృదయ స్పందనలు వస్తున్నట్లు తేలింది. అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ పరిక్షలో ఈ అసాధారణ విద్యుత్ కేంద్రం ఎడమ కరోనరీ ధమనికి అత్యంత సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో చికిత్స చేయడం వైద్యులకు తీవ్ర సవాలుగా మారింది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రధాన రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనికి గాయమై ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సంక్లిష్టమైన పరిస్థితిలో నిమ్స్ వైద్యులు కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా ధమని స్థానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో చాకచక్యంగా 3D మ్యాపింగ్ సహాయంతో ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ మరియు రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నిర్వహించారు. ధమనికి ఎలాంటి హాని కలగకుండా, అసాధారణ స్పందనలకు కారణమైన కేంద్రాన్ని విజయవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ అరుదైన, ఖరీదైన శస్త్రచికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేసి ఆ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ రంగంలో ఇటువంటి అత్యాధునిక EPS+RFA చికిత్సను అందించే ఏకైక ఆసుపత్రి నిమ్స్ మాత్రమేనని వైద్యులు తెలిపారు. తరచుగా గుండె దడ, ఆయాసం, ఛాతీలో అసౌకర్యం లేదా తలతిరగడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హోల్టర్, ఎకో లేదా గుండె MRI పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. </b>
పేదరికం ఒకవైపు, ప్రాణాల మీదకు తెచ్చే అరుదైన గుండె సమస్య మరొక వైపు.. తెలంగాణకు చెందిన ఓ 30 ఏళ్ల దినసరి కూలీ జీవితంలో తలెత్తిన పెద్ద సంక్షోభమిది. రెండేళ్ల క్రితం కష్టం చేసి పనిచేస్తున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆయాసం, ఛాతీలో తీవ్రమైన నొప్పి ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదిస్తే ఈసీజీ, గుండె ఎంఆర్‌ఐ పరీక్షలు చేసి వెంటిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ అనే అరుదైన గుండె లయ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడ రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును భరించే శక్తి ఆ నిరుపేద కార్మికుడికి లేకపోయింది. చివరికి దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ఆశ్రయించాడు.
నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ. సాయి సతీష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి హోల్టర్ మానిటరింగ్ పరీక్ష నిర్వహించారు. దీంతో అతని గుండెలో ఏకంగా 57 శాతం అసాధారణ విపరీత హృదయ స్పందనలు వస్తున్నట్లు తేలింది. అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన 3D ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ పరిక్షలో ఈ అసాధారణ విద్యుత్ కేంద్రం ఎడమ కరోనరీ ధమనికి అత్యంత సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో చికిత్స చేయడం వైద్యులకు తీవ్ర సవాలుగా మారింది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రధాన రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనికి గాయమై ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సంక్లిష్టమైన పరిస్థితిలో నిమ్స్ వైద్యులు కరోనరీ యాంజియోగ్రఫీ ద్వారా ధమని స్థానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో చాకచక్యంగా 3D మ్యాపింగ్ సహాయంతో ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ మరియు రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నిర్వహించారు. ధమనికి ఎలాంటి హాని కలగకుండా, అసాధారణ స్పందనలకు కారణమైన కేంద్రాన్ని విజయవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ అరుదైన, ఖరీదైన శస్త్రచికిత్సను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేసి ఆ యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ రంగంలో ఇటువంటి అత్యాధునిక EPS+RFA చికిత్సను అందించే ఏకైక ఆసుపత్రి నిమ్స్ మాత్రమేనని వైద్యులు తెలిపారు. తరచుగా గుండె దడ, ఆయాసం, ఛాతీలో అసౌకర్యం లేదా తలతిరగడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హోల్టర్, ఎకో లేదా గుండె MRI పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..