Sadaa: నా జీవితంలో ఆ సినిమా చేసి తప్పు చేశా.. నేను అలాంటి పాత్ర చేశానని తిట్టారు.. హీరోయిన్ సదా..
ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ సదా. జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న సదా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘జయం’ సినిమాతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సదా. తొలి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, డ్యాన్స్ షో ‘ఢీ’ నుంచి తప్పుకోవడంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు తేజా తనకు ‘జయం’ చిత్రంతో అవకాశం ఇవ్వడం తన అదృష్టమని సదా పేర్కొన్నారు. అయితే, సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్ లేదా సరైన గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు లేకపోవడం వల్ల కెరీర్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తన ప్రమేయం లేకుండానే కొన్ని ప్రాజెక్టులు చేజారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నితిన్ సినిమాలో ‘రాను రాను అంటుందో చిన్నదో’ పాట రీమేక్ సమయంలో తనను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించామని నిర్మాతలు తెలిపారని, కానీ నిజానికి తన వరకు ఆ ఆఫర్ అసలు రాలేదని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
మధ్యలో ఏం జరుగుతోందో, తన వద్దకు ఆఫర్లు రాకుండా ఎవరు ఆపుతున్నారో తనకూ అర్థం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన ‘ఢీ’ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించిన సదా, వరుసగా మూడేళ్ల పాటు చేసిన తర్వాత ఒకే రకమైన రొటీన్ అనిపించడంతో చిన్న బ్రేక్ తీసుకున్నానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
అలాగే, తమిళంలో తాను నటించిన ‘టార్చ్ లైట్’ సినిమా గురించి మాట్లాడుతూ..నేను చాలా సిగ్గుపడే స్వభావం ఉన్నదాన్ని, కానీ ఒక మహిళ జీవిత కథ ఆధారంగా వచ్చిన సబ్జెక్ట్ కావడంతో ధైర్యం చేసి ఆ బోల్డ్ పాత్రలో నటించాను. కానీ ప్రేక్షకులు దానిని కథగా చూడకుండా ‘సదా ఇలాంటి పాత్ర ఎందుకు చేసింది?’ అని ప్రశ్నించడం నన్ను తీవ్రంగా షాక్‌కు గురిచేసింది” అని ఆవేదన చెందారు. సినిమాలకు కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ, తిరిగి వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు అదే ప్రేమను, ఆదరణను చూపిస్తున్నారని సదా ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
