Krishna Janmashtami: సంవత్సరాలు గడిచినా తగ్గని క్రేజ్.. కృష్ణాష్టమికి ఈ సాంగ్ ఉండాల్సిందే.. మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు..
సంవత్సరాలు గడిచినా క్రేజ్ తగ్గని పాటలు చాలా ఉన్నాయి. అందులో ఆధ్యాత్మిక భక్తిరస గీతాల గురించి చెప్పక్కర్లేదు. ఇక కృష్ణాష్టమి వచ్చిందంటే చాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక పాట మాత్రం ప్రతి తెలుగు ప్రేక్షకులను ఆధ్యాత్మిక మైమరపులో ముంచెత్తుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఈ సాంగ్ మారుమోగుతుంది.

కృష్ణాష్టమి (గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం, బహుళ పక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి కృష్ణుడి జన్మసమయం వరకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న చిన్నారి కృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు) లతో అభిషేకం చేసి, కొత్త వస్త్రాలు , పూలతో అలంకరిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు తమ ఇంటికి రావాలని ఆకాంక్షిస్తూ ఇంటి గుమ్మం నుండి పూజా మందిరం వరకు బియ్యప్పిండితో చిన్నారి కృష్ణుడి పాదాల ముద్రలను వేస్తారు. అలాగే తమ ఇంట్లో చిన్నారులకు రాధ కృష్ణులుగా తయారు చేసి ఆనందిస్తారు. అయితే కృష్ణాష్టమికి కొన్ని పాటలు కూడా చాలా ఫేమస్. అందులో తెలుగులోని కెరటాల అడుగుల సాంగ్ కూడా.
2001లో వచ్చిన తెలుగు చిత్రం ‘దేవీపుత్రుడు’ లోని “కెరటాల అడుగున” అనే భక్తి , మధురమైన పాటకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ‘దేవీపుత్రుడు’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించగా, దర్శకుడు కోడి రామకృష్ణ ద్వారక నగరం, శ్రీకృష్ణుడి నేపథ్యంతో సోషియో-ఫాంటసీ కథాంశాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన స్వరాలు సినిమాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. అందులోనూ “కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా” అనే పాట ఒక భక్తి తరంగం ఇప్పటికీ చిన్నారుల నుంచి పెద్దవారికి వరకు ఎంత ఆనందంగా పాడుకుంటారు.
ఈ పాటను ప్రముఖ గాయని నిత్యశ్రీ మహదేవన్ ఎంతో భక్తిశ్రద్ధలతో, కంఠస్వరంలో ప్రత్యేకమైన ఆర్ద్రతతో ఆలపించారు. సముద్ర గర్భంలో మునిగిపోయిన పవిత్ర ద్వారకా నగరం ప్రాశస్త్యాన్ని , శ్రీకృష్ణుడి వైభవాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. “ఆ కృష్ణుడు ఏలిన ద్వారక… శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక” అంటూ సాగే సాహిత్యం వింటుంటే మైమరపించే అనుభూతి కలుగుతుంది. ‘దేవీపుత్రుడు’ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటినా, “కెరటాల అడుగున” పాటలోని ఆధ్యాత్మికత , సంగీత మాధుర్యం ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.
కెరటాల అడుగున సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..
