AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలంగా నటుడిగా కొనసాగుతున్నారు తనికెళ్ల భరణి. ఎన్నో వందల చిత్రాల్లో నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే రచయిత తనికెళ్ల భరణి దర్శకుడు వంశీపై తనకున్న అనుబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.
Tanikella Bharani
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2026 | 2:35 PM

Share

తనికెళ్ల భరణి.. నటుడిగా, రచయితగా, విలన్ పాత్రలతో మెప్పించాడు. ఇటీవల ఓ వేడుకలో దర్శకుడు వంశీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, లేడీస్ టైలర్ చిత్రం గురించిన మధుర స్మృతులను భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ ప్రసంగం కేవలం గత స్మృతులను మాత్రమే కాకుండా, సినిమా అనేది ఒక సామూహిక కృషి అని, దాని విజయం అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని తెలియజేసింది. తనికెళ్ల భరణి తన ప్రసంగాన్ని లేడీస్ టైలర్ చిత్రంతో ప్రారంభించారు. “ఇరవై ఐదు ఏళ్ల క్రితం లేడీస్ టైలర్ మొత్తం తెలుగు నాట పెద్ద సంచలనం” అని ఆయన గుర్తు చేసుకున్నారు. వంశీ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఆ చిత్రం విజువల్స్, సంభాషణలు, పాటలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశాయని, దాదాపు ఒక సంవత్సరం పాటు దాని ప్రభంజనం కొనసాగిందని వివరించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఆరకలో మొదలై, గోదావరిలో పూర్తయిందని తెలిపారు. దర్శకుడు వంశీకి ఆరక , గోదావరి ప్రాంతాలు చాలా ప్రీతికరమని, ఆయన తన కథలను ప్రధానంగా ఆ బ్యాక్‌డ్రాప్‌లోనే రాసుకుంటారని భరణి వెల్లడించారు. కథ మొదలైనప్పుడు ముందుగా బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకోవడం వంశీ గారి ప్రత్యేకత అని, దానిని బట్టి సినిమా రంగు మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

తాను వంశీ గారితో చాలా సుదీర్ఘ ప్రయాణం చేశానని, అందులో మొదటిది లేడీస్ టైలర్ అని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు తాను ఆకట్టుకున్న ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ పోషించిన సుందరం పాత్ర “ఒరేయ్ సీతారాముడు, రాత్రి నాకు సరస్వతి కలలోకి వచ్చి నాలుక మీద రాసిందిరా” అనగా, అవతలి వ్యక్తి “ఏంటి పచ్చడా?” అని అడగగా, “పచ్చడి కాదురా, బీజాక్షరాలు” అని సుందరం చెప్పే సంభాషణను ఉటంకించారు. వంశీ గారు తనకు అప్పట్లో “ప్రతీ సీను ఇలాగే ఉండాలి, ప్రతీ సీను లేడీస్ టైలర్లో ఇలాగే ఉండాలి” అని మీటర్‌ను ఇచ్చారని తెలిపారు. ఆ ప్రయత్నంలో అందరూ కలిసి పని చేసి విజయం సాధించామని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

సినిమా అనేది ఎల్లప్పుడూ ఒక సామూహిక కళ అని తనికెళ్ల భరణి గట్టిగా చెప్పారు. “దర్శకుడి నుండి బాయ్ దాకా ఇదంతా మా సినిమా. ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్” అని ఆయన అన్నారు. ఒక ఫ్లూట్ విద్వాంసుడు లేదా ఒక కవిత రాసిన రచయిత “నేను దీన్ని చేశాను” అని చెప్పగలరేమో కానీ, సినిమా విషయానికి వస్తే, అది ఎప్పుడూ ఒక గ్రూప్ ఆర్ట్ అని, అందరూ కలిస్తేనే ఒక హిట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ సామూహిక కృషి వల్లే లేడీస్ టైలర్ పరిమళాలు, జ్ఞాపకాలు ఇప్పటికీ మిగిలిపోయాయని ఆయన అన్నారు. రచయితగా తన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా లేడీస్ టైలర్ అని, ఆ విషయంలో వంశీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Follow Us