అమీర్ పేట్ టూ హైటెక్ సిటీ: ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో..
మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ అధికారులు మరో గుడ్ న్యూస్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్ సిస్టమ్‌ను మెట్రో అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు సేవలందిస్తోంది. ఇప్పటివరకూ జూబ్లీ చెక్ పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడిపింది మెట్రో. రివర్సల్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై అమీర్ పేట నుంచి హైటెక్ […]
మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ అధికారులు మరో గుడ్ న్యూస్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్ సిస్టమ్‌ను మెట్రో అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు సేవలందిస్తోంది. ఇప్పటివరకూ జూబ్లీ చెక్ పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడిపింది మెట్రో. రివర్సల్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాబులో ఉండనుంది. ఇక ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. హైటెక్ సిటీ నుంచి అమీర్ పేట వరకు 4 వారాల పాటు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండనుంది. తరువాత పరిస్థితులను బట్టి సమయాన్ని మరింతగా తగ్గించి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ఒక మెట్రో రైలును అందుబాటులో ఉంచుతామని మెట్రో అధికారులు తెలిపారు.