మెట్రో రైల్లో బుస్ బుస్.. పామును పట్టేశారోచ్..!
మొన్నటి వరకు ఏపీని వణికించిన పాములు..ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన్నట్లున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలులో పాము కలకలం రేపింది. మెట్రో సిబ్బందిని, ప్రయాణికులను సుమారు ఆరు రోజులపాటు హడలెత్తించి చివరకు పట్టుబడింది. ఎల్బీనగర్ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో ఈ నెల 14 నుంచి రైలును నిలిపివేశారు. డీబీ031 అనే నెంబర్ గల మెట్రోరైలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తుండగా పైలట్ డ్యాష్ బోర్డులో పాము ప్రత్యక్షం కావడంతో వెంటనే రైలును నిలిపి వేసి […]
మొన్నటి వరకు ఏపీని వణికించిన పాములు..ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన్నట్లున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలులో పాము కలకలం రేపింది. మెట్రో సిబ్బందిని, ప్రయాణికులను సుమారు ఆరు రోజులపాటు హడలెత్తించి చివరకు పట్టుబడింది. ఎల్బీనగర్ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో ఈ నెల 14 నుంచి రైలును నిలిపివేశారు. డీబీ031 అనే నెంబర్ గల మెట్రోరైలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తుండగా పైలట్ డ్యాష్ బోర్డులో పాము ప్రత్యక్షం కావడంతో వెంటనే రైలును నిలిపి వేసి స్నేక్ సోసైటీకి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫ్రెండ్స్ ఆప్ స్నేక్ సోసైటీ సభ్యులు పాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.