Blackmailed: మార్ఫింగ్ చేసిన వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి రూ.55 వేల దోపిడి
Blackmailed: మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే మెసగాళ్లు నిలువునా మోసగిస్తున్నారు. గుర్తు తెలియని..
Blackmailed: మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే మెసగాళ్లు నిలువునా మోసగిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ (Phone Call)చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు (Money) డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కేసులపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. నార్సింగ్‌కు చెందిన ఓ వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. తక్షణమే రూ.55 వేలు చెల్లించాలని, లేకపోతే వీడియోలను మార్ఫింగ్‌చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించాడు. అయితే వీడియో కాల్ చేసిన ఎలాంటి వీడియో కనిపించలేదని, ఖాళీగా కనిపించిందని చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.
అయితే వీడియో కాల్ చేసిన తర్వాత కట్ చేసి కొన్నినిమిషాల తర్వాత మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను చూపించాడు. దీంతో భయపడిన సదరు వ్యక్తి ముందుగా రూ.5వేలు చెల్లించాడు. తర్వాత రూ.30 వేలు డిమాండ్ చేయడంతో మళ్లీ డబ్బులను పంపించాడు. బాధితుడు మరోసారి రూ.20వేలు చెల్లించాడు. ఇలా మొత్తం రూ.55వేల వరకు ఆ మోసగాడి ఖాళీకు పంపించాడు బాధితుడు. ఇలా తర్వాత కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
జాగ్రత్తగా ఉండాలి
ఇలాంటి ఫోన్ కాల్ విషయంలో జాగ్రత్తగా వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, వీడియో కాల్స్ వచ్చినట్లయితే వెంటనే పోలీసులు సంప్రదించాలని, భయంతో వారి ఖాతాల్లో డబ్బులు వేయడం లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: