AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాహనదారులకు అలెర్ట్‌.. రెండురోజుల్లోపు వాటిని క్లియర్‌ చేసుకోకపోతే దబిడి దిబిడే..

హైదరాబాద్‌ నగరంలోని వాహనదారులకు అలెర్ట్‌.. వాహనాల ట్రాఫిక్‌ చలాన్లపై ఇచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌ త్వరలోనే ముగిసిపోనుంది. బైక్లు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కలిపి ఈనెల 31లోపు క్లియర్‌ చేసుకోండి.

Hyderabad: వాహనదారులకు అలెర్ట్‌.. రెండురోజుల్లోపు వాటిని క్లియర్‌ చేసుకోకపోతే దబిడి దిబిడే..
Traffic Challan
Basha Shek
|

Updated on: Mar 29, 2022 | 11:31 AM

Share

‘హైదరాబాద్‌ నగరంలోని వాహనదారులకు అలెర్ట్‌.. వాహనాల ట్రాఫిక్‌ చలాన్లపై ఇచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌ త్వరలోనే ముగిసిపోనుంది. బైక్లు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కలిపి ఈనెల 31లోపు క్లియర్‌ చేసుకోండి. లేకపోతే ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.’.. అని హైదరాబాద్‌ పోలీసులు నగరవాసులకు హెచ్చరిస్తున్నారు. కాగా హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పరిధిలో పేరుకుపోయిన పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల1 నుంచి పెండింగ్‌ ఛలానాలు ఉన్న ద్విచక్రవాహనదారులకు 75శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పించారు. పెండింగ్‌ చలాన్లను మీ సేవా సెంటర్లలో కూడా చెల్లించవచ్చని సూచించారు. ఇందుకు తగ్గట్లే వాహనదారుల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సుమారు 5 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా, మార్చి 28వ తేదీ నాటికి 43 శాతం చలాన్లు వసూళ్లయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

పొడిగింపు ఆలోచన లేదు!

కాగా ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. పెండింగ్‌ జరిమానాలు క్లియర్‌ చేసుకోవాలంటూ కొన్ని చోట్ల నేరుగా ఉల్లంఘనదారుల ఇళ్లకే వెళుతున్నారు. కాగా ఈవిషయంపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరైనా సరే ఛార్జిషీట్లు వేస్తామని, పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ చలాన్లు క్లియర్‌ చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

Also Read:Aadhaar Card: పాస్‌పోర్టు ఉంటే వారు కూడా ఆధార్‌ కార్డు పొందవచ్చు..!

IFFCO AGT Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Viral Video: బంధీ నుంచి విముక్తి.. కానీ ఎగరడమే మర్చిపోయింది.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..