Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సాక్ష్యుల భద్రతపై కోర్టు కీలక ఆదేశాలు..

YS Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను సేకరించారు.

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సాక్ష్యుల భద్రతపై కోర్టు కీలక ఆదేశాలు..
Viveka Murder Case
Follow us

|

Updated on: Mar 29, 2022 | 6:19 AM

YS Vivekananda Reddy Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను సేకరించారు. విచారణ నేపథ్యంలో.. సాక్షులకు భద్రత కల్పించాలని సీబీఐ కోరగా.. కడప కోర్టు (Kadapa District Court) ఈ ఆదేశాలను జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులకు భద్రతను పెంచుతూ కడప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్యకు గన్‌మెన్‌తో కూడిన వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని, అలాగే.. వివేకా వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ దస్తగిరికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా.. గత మూడు నెలలుగా వీరిరువురికీ పోలీసు భద్రత కల్పించినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే వారి భద్రత పర్యవేక్షణకు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించి.. గన్‌మెన్లతో కూడిన భద్రత కల్పించాలని కోర్టు సూచించింది. దీంతో వారిద్దరికి వెంటనే భద్రతా ఏర్పాట్లను పోలీసులు కల్పించారు.

కాగా.. వివేకా హత్య కేసులో దోషులతో పాటు సాక్షులకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీందోపాటు సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై నాలుగు రోజుల క్రితం విచారణ జరిపిన కడప కోర్టు.. సాక్షుల భద్రతపై పోలీసులను పలు ప్రశ్నలు సంధించింది. దీంతోపాటు సాక్షులకు సాయుధ దళాలతో కూడిన భద్రత ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.

Also Read:

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..

CM YS Jagan: నేను లేకుంటే గౌతమ్‌ రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో.. నా ప్రతి అడుగులోనూ తోడున్నాడుః వైఎస్ జగన్

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు