Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన భాగ్యం.. ఎప్పటినుంచంటే..?

Tirumala Tirupati Devasthanams: కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన భాగ్యం.. ఎప్పటినుంచంటే..?
Ttd
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2022 | 6:15 AM

Tirumala Tirupati Devasthanams: కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోన్న టీటీడీ భక్తులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శ్రీవారి దర్శనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనం (TTD special darshan) కల్పించనున్నట్లు టీడీపీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తిరుమల అధికారులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా భక్తుల నుంచి వస్తున్న వినతి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రత్యేక దర్శనం కోసం టోకెన్లను అందజేస్తారా..? లేక ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సింది. అయితే, రెండేళ్లుగా శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభమైన తర్వాత ప్రత్యక్షంగా ఆర్జిత, నిత్య సేవలలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ ఇంకా పరిశీలనలోనే ఉంచింది. అయితే.. దీనిపై కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..

అంతా బుల్డోజర్ బాబా మహత్యం.. రెండు వారాల్లో 50 మందికి పైగా నేరస్థులు లొంగిబాటు.. క్యూలో మరికొందరు!