Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..

Andhra Pradesh: నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో (ఫ్రెంచ్-అమెరికన్ ఆర్థికవేత్త) బృందం సోమవారం తాడెపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..
Nobel Winner Esther Duflo
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2022 | 10:56 PM

Andhra Pradesh: నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో (ఫ్రెంచ్-అమెరికన్ ఆర్థికవేత్త) బృందం సోమవారం తాడెపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు, పథకాల అమలు తీరును ఎస్తేర్ బృందానికి వివరించారు. కాగా, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న కార్యక్రమాలు.. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను నోబెల్ గ్రహీత కొనియాడారు.

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అర్థం చేసుకునేందుకే జగన్ ఐకానిక్ పాదయాత్ర చేపట్టారని, తద్వారా పేదలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని సీఎం జగన్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. మెజారిటీ స్కీమ్‌లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవడం అద్భుతం అని కితాబిచ్చారు. గృహనిర్మాణంలో గానీ, ఇతర పథకాల్లో గానీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనేక అంశాల్లో రూపలింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

కాగా, ఎస్తేర్ డుఫ్లో.. అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమర్‌లతో కలిసి 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆమె ‘ది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (J-PAL)’కి డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ప్రొఫెసర్ కూడా. ఇక ఎస్తేర్ డుఫ్లో బృందం సభ్యులు శోబినీ ముఖర్జీ, కపిల్ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also read:

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..