AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Job Mela: మంగళవారం ఏపీలో మరో జాబ్‌ మేళా.. 4 కంపెనీలు 200కిపైగా ఖాళీలు.. పూర్తి వివరాలు..

AP Job Mela: పలు ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వరుసగా జాబ్‌ మేళాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌మేళాను నిర్వహించేందుకు సిద్ధమైంది. మంగళవారం నెల్లూరులోని..

AP Job Mela: మంగళవారం ఏపీలో మరో జాబ్‌ మేళా.. 4 కంపెనీలు 200కిపైగా ఖాళీలు.. పూర్తి వివరాలు..
Narender Vaitla
|

Updated on: Mar 28, 2022 | 9:47 PM

Share

AP Job Mela: పలు ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వరుసగా జాబ్‌ మేళాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌మేళాను నిర్వహించేందుకు సిద్ధమైంది. మంగళవారం నెల్లూరులోని ఆదిత్య డిగ్రీ, పీజీ కాలేజీలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఏయే కంపెనీల్లో ఖాళీలు ఉన్నాయి.? ఇంటర్వ్యూలకు ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో 32 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఫీల్డ్‌ సేల్స్‌ ప్రమోటర్‌/టీమ్‌ లీడర్‌ పోస్టులు (30), టీమ్‌ లీడర్‌ (2) ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు వీటికి అర్హులు. సేల్స్‌ ప్రమోటర్‌/టీమ్‌ లీడర్‌ పోస్టులు ఎంపికైన వారికి నెలకు రూ. 13,000 నుంచి రూ. 14,000, టీమ్‌ లీడర్‌ పోస్టులకు రూ. 22,000 నుంచి రూ. 25000 వరకు చెల్లిస్తారు.

* భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌ లిమిటెడ్‌ సంస్థలో మొత్తం 100 మొబైల్‌ అసెంబ్లర్‌ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 12,500లతో పాటు ఫుడ్‌+అకామిడేషన్‌ అందిస్తారు.

* ఖజానా జువెలరీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, క్యాషియర్‌ (07), సేల్స్‌ ఆఫీసర్‌ (40), ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అసోసియేట్‌ (5), కస్టమర్‌ సపోర్ట్‌ (15) ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 నుంచి రూ. 18,000 వరకు చెల్లిస్తారు.

* హెచ్‌డీఎఫ్‌సీ సేల్స్‌లో డిప్యూటీ మేనేజర్‌ (03), ఏరియా మేనేజర్‌ (02), క్రెడిట్‌ ఆఫీసర్‌ (09) ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరు జిల్లాల్లోని అన్ని మండల్లాలో పని చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరయ్యే ముందు ఈ లింక్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను మంగళవారం (ఈ నెల 29) ఉదయం 10 గంటలకు ఆదిత్య డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీ, చిల్డ్రన్స్‌ పార్క్‌, రామ్‌జీ నగర్‌, నెల్లూరులో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్‌తో పాటు, విద్యార్హతల జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌ వెంట తెచ్చుకోవాలి.

* పూర్తి వివరాల కోసం 807634065 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

Also Read: Mirnalini Ravi: తన సొగసులతో హృదయాలు దోచేస్తున్న మృణాళిని.. లేటెస్ట్ ఫోటోస్

IPL vs PSL: ఐపీఎల్ బెస్ట్.. పీఎస్ఎల్ వేస్ట్ అంటోన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్.. ఎందుకంటే?

Viral Photo: విలక్షణ నటి కొత్త గెటప్‌.. బెత్తంతో భయపెడుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?