Viral Photo: విలక్షణ నటి కొత్త గెటప్.. బెత్తంతో భయపెడుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
Viral Photo: సోషల్ మీడియాలో (Social Media) నిత్యం ఏదో అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. పండుగల నుంచి ప్రత్యేక రోజుల వరకు అన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. సోషల్ మీడియా విస్తృతి కారణంగా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు సైతం...
Viral Photo: సోషల్ మీడియాలో (Social Media) నిత్యం ఏదో అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. పండుగల నుంచి ప్రత్యేక రోజుల వరకు అన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. సోషల్ మీడియా విస్తృతి కారణంగా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు సైతం తెలుస్తున్నాయి. తాజాగా ‘వరల్డ్ థియేటర్ డే’కి సంబంధించి నెట్టింట కొందరు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పుడంటే సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి కానీ ఒకప్పుడు మాత్రం ప్రేక్షకులకు వినోదం అందించే ఏకైక సాధనం నాటకం మాత్రమే. నాటకాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కుమంటోన్న ఎంతో మంది తారలు నాటకాల ద్వారానే ప్రపంచానికి పరిచయం అయ్యారు.
ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నటీమణి కూడా తన రంగస్థలం రోజులకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నాటకంలో భాగంగా మాస్టారు పాత్రలో బెత్తం పట్టుకొని చిన్నారిని మందలిస్తున్నట్లున్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకీ ఆ బ్లాక్ అండ్ ఫోటోలో ఉన్న ఆ నటీమణి ఎవరో గుర్తు పట్టారా.? తెలుగు సినిమా పరిశ్రమలో ఈ నటీమణి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. తండ్రి నట వారసత్వం ఉన్నా తన మల్టీ ట్యాలెంట్‌తో ఆకట్టుకుందీమే. నిర్మాతగా, హీరోయిన్‌గా, విలన్‌గా, సింగర్‌గా కూడా రాణిస్తూ మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతోంది.
View this post on Instagram
ఈ నటీమణి మరెవరో కాదు మంచు లక్ష్మీ. మోహన్ బాబు గారాల పట్టి ఒకప్పుడు అమెరికాలో విద్యనభ్యసించింది. ఈ సందర్భంగా లక్ష్మీ.. థియేటర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పూర్తి చేసింది. తాజాగా వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఈ ఫోటోను పంచుకున్న లక్ష్మీ, తనకు రంగ స్థలంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. లక్ష్మీ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
View this post on Instagram
Housing Prices: వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇలా ఉన్నాయి..!
Andhra Pradesh News: రాళ్లు, కర్రలతో యువకుల హల్చల్.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..