AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh News: రాళ్లు, కర్రలతో యువకుల హల్చల్‌.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..

Andhra Pradesh News: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్లు, కర్రలతో యువకులు హల్‌చల్‌ చేశారు. షాపులు, ఇళ్లపై రాళ్లు రువ్వారు. కర్రలతో అద్ధాలు పగులగొట్టి ఇళ్లు, షాపులు ధ్వంసం చేశారు. భయానక వాతావరణాన్ని..

Andhra Pradesh News: రాళ్లు, కర్రలతో యువకుల హల్చల్‌.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..
Representative Photo
Narender Vaitla
|

Updated on: Mar 28, 2022 | 2:47 PM

Share

Andhra Pradesh News: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్లు, కర్రలతో యువకులు హల్‌చల్‌ చేశారు. షాపులు, ఇళ్లపై రాళ్లు రువ్వారు. కర్రలతో అద్ధాలు పగులగొట్టి ఇళ్లు, షాపులు ధ్వంసం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. యువకులు బీభత్సంతో జనం భయపడి.. మంచాల కింద దాక్కున్నారు. వివరాల్లోకి వెళితే.. గురవాం గ్రామానికి చెందిన గొర్లె కిరణ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి.. పెద్దలు కిరణ్‌ను మందలించారు. దీంతో కిరణ్ ఈనెల 25న ఆత్మహత్య చేసుకున్నాడు.

కిరణ్‌ మృతికి యువతి బంధువులే కారణమంటూ అదే రోజు కిరణ్‌ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇద్దరి తరుపు బంధువులను పిలిచి చర్చలు జరిపి గొడవకు ముగింపు పలికేందుకు ప్రయత్నం చేశారు. అయితే కిరణ్ మృతికి కారకులైన యువతి బంధువులను వదిలే ప్రసక్తే లేదంటూ సోమవారం రాళ్లు, కర్రలు, కత్తులతో యువతి బంధువుల ఇంటిపై దాడికి చేశారు కిరణ్ తరుపు యువకులు. దీంతో గురువాంలో భయానక వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకులోపే యువకులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు

Also Read: IPL 2022: ఇంజనీరింగ్‌ చదివి క్రికెటర్ అయ్యాడు.. ఇప్పుడు ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌.. ఎటువైపు మొగ్గుచూపు..!

TSRTC: ప్రయాణికుల నడ్డి విరుస్తోన్న ఆర్టీసీ.. సెస్ పేరుతో మరో సారి వడ్డన

Kidney Healthy Foods: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏమి తినకూడదో తెలుసా..