Hari Hara Veera Mallu: పవర్ స్టార్ సినిమా కోసం లెజెండ్రీ ఆర్ట్ డైరెక్టర్.. సెట్టింగులు మాములుగా ఉండవట..
రీసెంట్‌గా భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యణ్ సాలిడ్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు.
Hari Hara Veera Mallu: రీసెంట్‌గా భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యణ్ సాలిడ్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ తన నెక్స్ట్ మూవీ పై దృష్టి పెట్టారు. పవన్ కళ్యణ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తుండగా మరో పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం చాలా రోజుల తర్వాత చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్‌కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఓ టీజర్ పవర్‌స్టార్ అభిమానులను తెగ ఖుషీ చేసింది. ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్లు వేయిస్తున్నారట..ఈ క్రమంలో హరిహరవీరమల్లు సెట్ లో లెజెండ్రీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జాయిన్ అయ్యారు. మొగలాయిలా కాలాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన సెట్టింగ్స్ కు రూపకల్పన చేస్తున్నారు తోట తరణి. తాజా షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెట్ లో తోట తరణి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలిశారు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పలు అంశాలపై పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.