PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

PM - MP Marriage: ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో పడటానికి, వయసుకు ఏమాత్రం సంబంధం లేదంటారు. ఇదే అంశాన్ని నిజం చేసి చూపారు ఇటలీ మాజీ ప్రధాని, ప్రస్తుత ఎంపీ. ఆయన వయసేమో 85 సంవత్సరాలు..

PM - MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Marriage
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2022 | 9:03 PM

PM – MP Marriage: ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో పడటానికి, వయసుకు ఏమాత్రం సంబంధం లేదంటారు. ఇదే అంశాన్ని నిజం చేసి చూపారు ఇటలీ మాజీ ప్రధాని, ప్రస్తుత ఎంపీ. ఆయన వయసేమో 85 సంవత్సరాలు.. ఈమె వయసు32 ఏళ్లు.. వీరిద్దరి మనసులు కలిశాయి. ఫలితంగా ఇద్దరూ పెళ్లికి సిద్ధమైపోయారు. అవును మీరు విన్న నిజమే.. ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ(85) తనకన్న 53 ఏళ్లు చిన్న అయిన మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆమె కూడా మరెవరో కాదు.. ఇటలీ ఎంపీ మార్తా ఫస్సీనా కావడం విశేషం. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు వివాహానానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బెర్లుస్కోనీ, మార్తా ఫస్సీనా సింబాలిక్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, వీరి వివాహానికి సిల్వియో సంతానం అంగీకరించడం లేదు. సిల్వియో బెర్లుస్కోనీకి పెళ్లై ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నారు. 85 ఏళ్ల వయసులో 32 ఏళ్ల మార్తాను పెళ్లి చేసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ వ్యతిరేకతకు అసలు కారణం వేరే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సిల్వియో.. మార్తాను పెళ్లి చేసుకుంటే అతని ఆస్తిలో సగం ఆమెకు చెందుతుంది. అంటే 417 బిలియన్ల రూపాయలు ఆమెకు వెళ్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారు ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

మార్తా ఫస్సీనా ఇంతకు ముందే.. ఇదిలాఉంటే.. మార్తా ఫస్సీనాకు ఇంతకు ముందు ఫ్రాన్సిస్కా పాస్కల్ అనే యువకుడితో రిలేషన్‌లో ఉంది. ఆ తరువాత అతనితో విడిపోయి.. తనకన్నా 53 ఏళ్లు పెద్దవాడైన సిల్వియో బెర్లుస్కోనీతో ప్రేమలో పడింది. ఆయనతో సహజీవనం చేస్తోంది.

వివాదాల్లో బెర్లుస్కోనీ.. ఇక ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ గురించి చెప్పుకోవాలంటే పెద్ద చరిత్రే ఉంది. ఈయన గారికి అఫైర్లు చాలా ఎక్కువేనట. ఇలాంటి విషయాల్లోనే ఆయన పేరు మారుమోగిపోయిన సందర్భాలున్నాయి. యంగ్ మోడల్స్‌తో సంబంధాల వల్ల ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అంతేకాదు.. సెక్స్‌ వర్కర్‌తో ఒక రాత్రి గడపడానికి రూ. 50 కోట్లు చెల్లించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన 85 ఏళ్ల వయసులో 32 ఏళ్ల మమిళతో సంబంధం కొనసాగించడం, పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Italy Ex Prime Minister

Italy Ex Prime Minister

Also read:

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..

Monkey Stuck in Sea: ‘లైఫ్ ఆఫ్ పై’ని తలపించే స్టోరీ.. మూడు నెలలుగా నడిసముద్రంలోనే కోతి.. చివరకు ఇలా కాపాడారు..!