Happiness index: ప్రపంచంలో సంతోషకర దేశం ఎదో తెలుసా.. తాజా ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత?
అభివృద్ధి చెందుతూ ఉన్న భారత్‌లో అన్ని కష్టాలే. మన బాధలు వింటే రామాయణమంతా, చెప్తే భారతమంతా. తాజా ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ మన బాధలు, మన గాధలను స్పష్టం చేస్తోంది.
Happiness index 2022: అభివృద్ధి చెందుతూ ఉన్న భారత్‌లో అన్ని కష్టాలే. మన బాధలు వింటే రామాయణమంతా, చెప్తే భారతమంతా. తాజా ఇండెక్స్‌లో భారత్(India) ర్యాంక్ మన బాధలు, మన గాధలను స్పష్టం చేస్తోంది. మన కష్టాలు, కన్నీళ్లను ఎత్తిచూపుతుంది. భారత్ ఎదుగుతోంది, మా ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, తాము తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో ప్రపంచం చూపు భారత్ వైపు అని కేంద్రం చెప్తోంది. తలసరి ఆదాయంలో వెనుకబడి మన దేశం ఎన్నో మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉందని తాజా ఇండెక్స్ స్పష్టం చేస్తోంది.
ప్రపంచంలోని ఒక దేశ పరిస్థితి ఆ దేశ ప్రజలు తమ జీవితాల్లో ఎంత సంతోషంగా ఉన్నారో నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 ప్రకారం, ఫిన్లాండ్ వరుసగా ఐదవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది. 146 దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. సంతోషకరమైన దేశాల జాబితాలో అమెరికా 16వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ వెనుకబడి ఉంది.
ఈ ఏడాది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో పాకిస్థాన్ 121వ స్థానంలో ఉంది. కాగా భారత్ 136వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ 94వ స్థానంలో, పొరుగున ఉన్న చైనా 72వ స్థానంలో ఉన్నాయి. సంతోషకరమైన దేశాలు ఆఫ్ఘనిస్తాన్ (146వ స్థానం), లెబనాన్ (145వ స్థానం), జింబాబ్వే (144వ స్థానం), రువాండా (143వ స్థానం), బోట్స్వానా (142వ స్థానం), లెసోతో (141వ స్థానం) ఉన్నాయి.
- వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్
- ప్రాంతంలో ఫిన్లాండ్ 7.8 పాయింట్లతో మొదటి స్థానం.
- 7.2 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా
- మూడో స్థానంలో 7 పాయింట్స్‌తో కెనడా, అమెరికాలు సంతోషంగా ఉన్నాయి.
- పెద్ద దేశాలైన రష్యా, చైనాలు 5.5 పాయింట్లతో నాట్ గుడ్, నాట్ బ్యాడ్ టైప్ ఉన్నాయి.
- ఇక ఆ తర్వాత స్థానంలో అన్నదే భారత్.
తూర్పు ఐరోపా, స్కాండినేవియన్ ప్రాంతం మరియు నార్డిక్ ప్రాంతం ప్రపంచ సంతోష సూచికలో సంతోషం పరంగా మొదటి 10 దేశాలలో అత్యధిక ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఫిన్లాండ్ 7.8 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్ ఉన్నాయి. ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి స్కాండినేవియన్ దేశాల వ్యవస్థలో చాలా ప్రత్యేకత ఏమిటి అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ మనకు ఇచ్చిన పాయింట్లు 3.8. మొత్తం 146 దేశాల్లో సర్వే నిర్వహిస్తే మన దేశం 136వ స్థానంలో ఉందంటే దేశ జనాభా ఎంత సంతోషంగా ఉన్నారో మనకు అర్థం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే.. జనులంతా పూర్తి బాధతో ఉన్నారని తాజా రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ మరో 75 మిలియన్ల జనాలను పేదరికంలోకి నెట్టిందని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే మనం ఏ మాత్రం సంతోషంగా లేమా అంటే.. గుడ్డిలో మెల్ల మాదిరి జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ కంటే కాస్తా మెరుగ్గా ఉన్నాం.
ఇక ఆ దేశాలకు వచ్చిన పాయింట్లను పరిగణిస్తే.. జింబాబ్వేకు వచ్చిన పాయంట్లు3, 2.8 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో ఉంది. అక్కడి ప్రజలు అసలు ఏ మాత్రం సంతోషంగా లేరని తాజా ఇండెక్స్ స్పష్టం చేస్తోంది. తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆఫ్ఘనిస్తాన్ 146 దేశాల్లో అట్టడుగున ఉంది. ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల సపోర్ట్ లేకపోవడం వంటివి ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపాయి. హ్యాపినెస్ యావరేజ్ 5.6 పాయింట్లుగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వివరించింది. నార్త్ అమెరికా రీజియన్‌లో కెనాడ టాప్ ప్లేస్‌లో నిలిచింది. సౌత్ అమెరికాలో ఉరుగ్వే హాపియేస్ట్ కంట్రీగా ఉంది. అక్కడ పర్ క్యాప్టా ఇన్‌కమ్ ఎక్కువ, పావర్టీ తక్కువ, మిడిల్ క్లాస్ జనాలు కూడా అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అందుకే ఉరుగ్వే లాంటివి హ్యాపియేస్ట్ మోడ్‌లో కంటిన్యూ అవుతున్నాయి.
అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఎందుకు? ప్రపంచంలోని అత్యంత పేద, మధ్య-ఆదాయ దేశాలలో సామాన్య ప్రజల అతిపెద్ద సమస్యలు ఖరీదైన విద్య, ఖరీదైన చికిత్స, ఖరీదైన రవాణా, ప్రతిరోజూ పెరుగుతున్న ఆహార ధరలు. కానీ ఫిన్లాండ్ వంటి స్కాండినేవియన్-నార్డిక్ ప్రాంతంలో ఏర్పాటు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందజేస్తుంది. ఇది కాకుండా, భద్రత, పోలీసింగ్, మానవ హక్కుల పర్యవేక్షణ, అధిక ఆదాయ స్థాయి, తక్కువ అవినీతి వంటి విషయాలు కఠినమైన చట్టాలు, బలమైన వ్యవస్థల ద్వారా నిర్ధారిస్తాయి. దీంతో సామాన్యుల జీవనం చాలా సులభతరమైంది. ఫిన్లాండ్ జనాభాలో 90 శాతం కంటే ఎక్కువ మంది జీవితంలోని అన్ని దశలలో సమతుల్యంగా పరిగణిస్తారు.
ఫిన్లాండ్ చాలా చల్లని వాతావరణంతో తూర్పు ఐరోపాలో ఒక భాగం, చల్లని కాలం 6 నెలల వరకు ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉండటం వల్ల ఈ దేశంలోని అనేక ప్రాంతాల్లో 6 నెలల పాటు రాత్రిపూట ఉంటారు. మన పర్యావరణం కంటే చాలా భిన్నమైనప్పటికీ ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా జీవించడం నేర్చుకున్నారు. మంచు, వాన, చలి మధ్య కూడా ఇక్కడి ప్రజలు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. మంచులో జాగింగ్, రైడింగ్, సైకిల్ తొక్కడం కోసం కూడా వెళ్తుంటారు. సంవత్సరంలో వెచ్చని నెలల్లో, ఇక్కడ ప్రజలు బహిరంగ నిద్ర, సైక్లింగ్, కయాకింగ్, హైకింగ్, క్యాంపింగ్ వంటి ప్రత్యేక కార్యకలాపాలను ఆస్వాదిస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, పర్యాటక ప్రదేశాలతో కూడిన కాలుష్య రహిత వాతావరణం ప్రజల జీవితాలకు భిన్నమైన తాజాదనాన్ని అందిస్తోంది.
నిరుద్యోగులు, మంచి ఉద్యోగం లేని వారి కోసం ప్రభుత్వ వ్యవస్థ కూడా ఉంది. డెన్మార్క్‌లో ఉద్యోగం లేనందుకు ప్రభుత్వం నెలకు స్టైపెండ్ ఇస్తుంది. అదనంగా, ఫిన్లాండ్, డెన్మార్క్ ప్రతి పౌరుడికి ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి. ప్రపంచంలోనే అతి తక్కువ నేరాల రేటు ఉన్న దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. దేశం పర్యాటకులకు కూడా సురక్షితంగా పరిగణిస్తారు. ఫిన్లాండ్ కూడా తన విద్యా వ్యవస్థలో సంవత్సరాలలో గొప్ప పురోగతిని సాధించింది. ఇక్కడి పాఠశాలలు, కళాశాలలు కేవలం పుస్తక జ్ఞానం కంటే విద్యార్థుల వృత్తిపరమైన అభ్యాసం, అభ్యాస నైపుణ్యాలపై దృష్టి పెడతాయి. దేశంలోని ప్రజలందరికీ సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుండి అత్యుత్తమ, సమానమైన వైద్య సదుపాయాలను అందుతాయి. ఉపాధి అవకాశాల సమానత్వానికి దేశం పేరుగాంచింది. ఈ లక్షణాలన్నింటి కారణంగా, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలను ప్రపంచంలోని సంతోషకరమైన ప్రాంతాలుగా పిలుస్తారు.
Read Also… Statue Of Equality: సమతామూర్తి కేంద్రంలో భక్తుల సందర్శన రద్దు.. ఎప్పటివరకంటే?