Statue Of Equality: సమతామూర్తి కేంద్రంలో భక్తుల సందర్శన రద్దు.. ఎప్పటివరకంటే?
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని శ్రీరామనుజచార్య దర్శనాలసు నాలుగు రోజులపాటు నిలివేస్తున్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది.
Statue Of Equality: ముచ్చింతల్(Muchintal) శ్రీరామనగరంలోని శ్రీరామనుజచార్య(Sri Ramanujacharya Swamiji) దర్శనాలసు నాలుగు రోజులపాటు నిలివేస్తున్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులను సందర్శనకు అనుమతించడం లేదని తెలిపారు. సమతామూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. తిరిగి ఏప్రిల్ 2వ తేదీ నుంచి యథాతథంగా భక్తులను సందర్శనకు అనుమతించనున్నట్ల పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకోవచ్చని వెల్లడించింది.
అలాగే, సమతామూర్తి కేంద్రం ప్రవేశ రుసుంలో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలాగే ప్రతి బుధవారం కేంద్రానికి సెలవు ఉంటుందని పేర్కొంది. సెల్‌ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలతో సమతామూర్తి కేంద్రంలోనాకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని సూచించారు. పాదరక్షలు బయటే వదలాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదని… ఈ నిబంధనలను భక్తులంతా పాటించాలని కోరారు. అమేరకు సమతామూర్తి స్ఫూర్తికేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదు.
- ఏప్రిల్ 2 అనగ ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం.
- సందర్శన సమయం ప్రతి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.
- యధావిధిగా ప్రతి బుధవారం సెలవు.
- ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు లేదు.
- సెల్‌ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ.
- దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలి.
- పాదరక్షలు బయటే వదలాలి.
- ఎటువంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదు.