Yadadri: ఘనంగా ముగిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు.. దర్శనమిచ్చిన పంచ నారసింహుడు..
Yadadri Lakshmi Narasimha Swamy: యజ్ఞాయాగాలతో పునీతమైన యాదాద్రి ఆలయం పరిసరాల్లో వేద ఘోష ప్రతిధ్వనించింది. చారిత్రక ప్రాశస్త్యం.. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు ముగిసింది. మహాకుంభ సంప్రోక్షణ వైభవోపేతంగా..
యజ్ఞాయాగాలతో పునీతమైన యాదాద్రి ఆలయం(Yadadri) పరిసరాల్లో వేద ఘోష ప్రతిధ్వనించింది. చారిత్రక ప్రాశస్త్యం.. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు ముగిసింది. మహాకుంభ సంప్రోక్షణ వైభవోపేతంగా జరిగింది. బాలాలయం నుంచి ఉత్సవ మూర్తులు గర్భాలయంలోకి ప్రవేశించడంతో.. ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సీఎం తొలి పూజతో.. నవ వైకుంఠ ఉత్సవ మూర్తి సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న ఘడియ రానే వచ్చింది. గర్భాలయంలోని నవ వైకుంఠంలో ఆశీనులైన నరసింహ స్వామి దర్శన భాగ్యం కలిగింది. సీఎం చేతులు మీదుగా గర్భాలయంలో ఉత్సవ మూర్తికి తొలి పూజతో మహా క్రతువు ముగిసింది.
ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6.30 గంటలకు బాలాలయంలో హవనం జరిగింది. 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగుసింది. ఆ తర్వాత స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, ఆళ్వారులు, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు.
ఈ క్రతువులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా కేసీఆర్.. ఉత్సవ మూర్తులకు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ ప్రతిష్టామూర్తుల శోభాయత్రతో ఈ మహా ఉద్ఘాటన క్రతువు మొదలయింది. శోభాయాత్ర ప్రధానాలయం రెండో మాడవీధిలో ప్రదక్షిణ తర్వాత.. తొలి మాడ వీధిలోకి చేరుకున్న తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రధాన రాజగోపురం దగ్గర, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మిగతా గోపురాల దగ్గర.. ఉప ఆలయాలు, ప్రకార మండపాల దగ్గర సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణ తర్వాత నేరుకు గర్భాలయంలోకి వెళ్లారు సీఎం. స్వయంభూ విగ్రహం దగ్గర సీఎం తొలి పూజ చేశారు. దీంతో నవ వైకుంఠ ప్రారంభోత్సవం తర్వాత సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..