Yadadri: వైభవంగా ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శోభాయాత్ర..
Maha Kumbha Samprokshana Ceremony: యజ్ఞాయాగాలతో పునీతమైన యాదాద్రి భక్త సంద్రంతో పులకించి పోతోంది. ఆలయ పరిసరాల్లో వేద మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనిస్తున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం.. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు..
యజ్ఞాయాగాలతో పునీతమైన యాదాద్రి భక్త సంద్రంతో పులకించి పోతోంది. ఆలయ పరిసరాల్లో వేద మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనిస్తున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం.. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు వైభవంగా జరుగుతోంది. యాదాద్రికి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు(Telangana CM K Chandrashekar Rao) ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం కేసీఆర్.. ఉత్సవ మూర్తుల శోభాయాత్రను ప్రారంభించారు. ప్రతిష్టామూర్తుల శోభాయత్రతో ఈ మహా ఉద్ఘాటన క్రతువు మొదలయింది. శోభాయాత్ర ప్రధానాలయ రెండో మాడవీధిలో ప్రదక్షిణ తర్వాత.. తొలి మాడ వీధిలోకి చేరుకున్న తర్వాత మహాకుంభ సంప్రోక్షణ చేశారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో పాటు.. ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ జరిగింది.
వైభవంగా ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు..
ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు వైభవంగా మొదలయింది. ముందుగా సోమవారం ఉదయం 6.30 గంటలకు బాలాలయంలో హవనం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో పూర్ణాహుతితో పంచకుండాత్మక యాగం ముగుసింది. ఆ తర్వాత స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, ఆళ్వారులు, ఆండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని బాలాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శోభాయాత్రను ప్రారంభించి.. ఆలయం చుట్టూ ఉత్సవ మూర్తులను ఊరేగించారు.
ఆ తర్వాత మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభమయింది. సీఎం కేసీఆర్ ప్రధాన రాజగోపురం దగ్గర, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు మిగతా గోపురాల దగ్గర.. ఉప ఆలయాలు, ప్రకార మండపాల దగ్గర సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణ తర్వాత నేరుకు గర్భాలయంలోకి వెళ్లారు. స్వయంభూ విగ్రహం దగ్గర సీఎం తొలి పూజ చేశారు.
ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..