AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: మానసిక ఆందోళన పెరుగుతుంది.. ఉద్యోగంలో మార్పులుంటాయి.. సోమవారం రాశిఫలాలు..

ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తగ్గుతాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

Horoscope Today: మానసిక ఆందోళన పెరుగుతుంది.. ఉద్యోగంలో మార్పులుంటాయి.. సోమవారం రాశిఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2022 | 7:43 AM

Share

మేష రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తగ్గుతాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి.

వృషభ రాశి.. వీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు తగ్గుతాయి.

మిథున రాశి.. వీరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు నూతన వస్తు.. వస్త్ర.. వాహన..ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. చేపట్టిన పనులను నిర్ణిత సమయంలో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి.. ఈరోజు వీరికి సంఘంలో కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడిపేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రుబాధలు తగ్గుతాయి. వృత్తి.. వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.

కన్య రాశి.. ఈరోజు వీరికి బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడుతుంటాయి. చేపట్టే పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబంలో జరిగే సంఘటనల వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతారు.

తుల రాశి.. ఈరోజు వీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కొత్తవారితో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు.. రుణ బాధలు అధికమవుతాయి.

వృశ్చిక రాశి.. కుటుంబసభ్యులు.. స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో కీర్తి మర్యదలు తగ్గుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులను పూర్తిచేసుకుంటారు.

ధనుస్సు రాశి.. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాల ఆలస్యంగా లభిస్తాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి.. వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. మానసికానందాన్ని పొందుతారు. సంఘంలో కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి.. వీరు మానసికానందాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.

మీన రాశి.. వీరి మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఆకస్మిక కలహాలు పెరుగుతాయి. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.

Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!