Horoscope Today: శుభవార్త వింటారు.. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (March 29 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.
Horoscope Today (March 29 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 29వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి అనుకున్న పనులను సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తారు. రాముడిని ఆరాధిస్తే మంచి కలుగుతుంది.
వృషభ రాశి ఈరాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అయితే కీలక విషయాల్లో తోటివారి సలహాలు, సూచనలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇష్టదేవతను పూజిస్తే మరింత మేలు చేకూరుతుంది.
మిథునరాశి వీరికి మిశ్రమకాలం నడుస్తోంది. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అయితే కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదరవుతాయి. వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలి. మనోధైర్యం కోల్పోకుండా చూడాలి. దుర్గాదేవి ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి వీరికి కూడా మిశ్రమ కాలం నడుస్తోంది. బాగా కష్టపడితే తప్ప సకాలంలో పనులు పూర్తి కావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. పోషకాహారం తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మాటలకు గౌరవం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించకుంటే మంచి కలుగుతుంది.
సింహ రాశి ఈరాశి వారు ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
కన్య రాశి మానసిక ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం నడుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు.
తుల రాశి అనుకున్న పనులు నెరవేరాలంటే శ్రమించక తప్పదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వల్ల సానుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే చేసే పనుల్లో విజయాలు అందుకుంటారు. ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనవసర గొడవల్లో తలదూర్చి సమయాన్ని వృథా చేసుకోకపోవడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు రాశి ఈరాశి వారికి అనుకూల ఫలితాలు ఎదురవుతాయి. గొప్ప విజయాలు అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి దర్శించకుంటే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.
మకర రాశి ఆలోచనల్లో స్థిరత్వం పాటించాలి. అప్పుడే అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబీకులు, బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. గడ్డు పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.
కుంభ రాశి స్నేహితులు మాటలు వినడం వల్ల మేలు కలుగుతుంది. కొన్ని పనుల్లో అనుకూల ఫలితాలు సాధించాలంటే శ్రమించక తప్పదు. ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మీనరాశి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మేలు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read:Kim Jong Un: అమెరికాను అలా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న కిమ్.. ప్లాన్ ఏంటంటే..
Baba Vanga: పుతిన్ ప్రపంచానికి ప్రభువు అవుతాడు.. బాబా వాంగా జోస్యం ఫలిస్తుందా..?
Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..