AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తుల్లో గెలవాలనే తపన ఎక్కువ.. అందులో మీరున్నారా..

Zodiac Signs: ఒక్కో రాశికి చెందిన వ్యక్తులు ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటారు . జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, 4 రాశుల వ్యక్తులలో గెలవాలనే అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది..

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తుల్లో గెలవాలనే తపన ఎక్కువ.. అందులో మీరున్నారా..
Zodiac Sign
Surya Kala
|

Updated on: Mar 29, 2022 | 8:25 PM

Share

Zodiac Signs: ఒక్కో రాశికి చెందిన వ్యక్తులు ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటారు . జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, 4 రాశుల వ్యక్తులలో గెలవాలనే అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు పోటీ స్వభావం కలిగి ఉంటారు . ఏదో ఒక పనిలో పోటీదారుడు దొరికితే తప్ప, ఆ పని చేసే ఉత్సాహం వీరికి  ఉండదు. ఈ కారణంగా, చాలా సార్లు ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి కూడా  భయపడరు. ముందుకు వెళ్లాలనే తపన ఈ వ్యక్తుల్లో ఎంతగానో ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వ్యక్తులు పెద్ద కష్టాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వ్యక్తులు జీవితంలో చాలా మంచి స్థానాలను సాధించడానికి ఇదొక కారణం. పోటీ లక్షణా;ఉన్న 4 రాశికి చెందిన వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకుందాం..

మేషరాశి:  మేషం మొదటి రాశి. ఈరాశికి అధిపతి అంగారకుడు. గ్రహాలకు అధిపతిగా అంగారకుడు  పరిగణించబడుతున్నాడు. అంగారక గ్రహం చాలా వేగం కలిగింది, తేజస్సు శౌర్యం వంటి లక్షణాలకు అధిపతి అంగారకుడు. ఇవే గుణాలు ఈ రాశి వారిలోనూ కనిపిస్తాయి. ఈ వ్యక్తులు ఏదైనా పని చేయాలనీ నిర్ణయం తీసుకున్న సమయంలో.. తమ పూర్తి శక్తిని, తెలివి తేటలను ఉపయోగిస్తారు. తాను గెలవడమే లక్ష్యంగా పనిచేస్తారు. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే చాలాసార్లు నిరాశకు లోనైనప్పటికీ వదలరు. వారు గెలిచే వరకు పోరాడుతూనే ఉంటారు.

వృషభం: ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరు ముందుకు సాగాలనే గొప్ప తపనతో ఉంటారు. అంతేకాదు ఈ వ్యక్తులు చాలా మొండి తనం కలిగి ఉంటారు. ఈ గుణం వలన ఈ రాశివారు ఏదైనా పని చేపడితే..  అది పూర్తయ్యే వరకు బిజీగానే ఉంటారు. పని పూర్తి అయ్యేవరకూ సమయం వృధా అయినా ఆ పనిని చేయడం ఆపరు.

తులరాశి: ఈ రాశివారిలో పోటీ స్ఫూర్తి చాలా బలంగా ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థిని ఎలా ఓడించాలనే ఆలోచనలో ఉంటారు. దీని కోసం, తెలివిగా పని చేస్తారు. లక్ష్యంలో విజయం సాధించే వరకు ప్రయత్నిస్తారు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. ఈ వ్యక్తులు ఓడిపోయినప్పుడు కోపంతో చాలాసార్లు సమతుల్యతను కోల్పోతారు. ఈ వ్యక్తులు గెలవడానికి మాత్రమే సృష్టించబడ్డారని వారు భావిస్తున్నారు.

వృశ్చికరాశి: ఈ రాశి వారు కొబ్బరికాయ లాంటివారు. బయటి నుండి చూస్తే కఠినంగా కనిపిస్తారు..  అయితే వీరి మనసు చాలా మృదువైనది. తమ కష్టార్జితంతోనే అన్నీ సాధిస్తారు. అయితే వీరి శ్రమపడే తత్వం చాలా మందికి వీరిని శత్రువులుగా మారుస్తుంది. వీరు వారికి ప్రత్యర్థులుగా మారతారు. అటువంటి పరిస్థితిలో..  ఈ వ్యక్తులు తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తారు. తమ లక్ష్యంలో విజయం సాధించిన తర్వాత మాత్రమే రిలాక్స్ అవుతారు.

(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన, నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ పాఠకుల ఆసక్తిని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని   అందించబడింది.)

Also Read: KS Ramarao: కర్నూలుని మూవీ హబ్‌గా తీర్చిదిద్దుదాం.. త్వరలో సినీ పెద్దలను కలుస్తా అంటున్న నిర్మాత

ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ బైక్ 660 పనితీరు, ధర, ఫీచర్లు (web story)