- Telugu News Photo Gallery Healthy Diet Tips: Add these super and healthy fat food in your diet in Telugu
Healthy Diet Tips: హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా..? అయితే ఈ కొవ్వు పదార్ధాలను ఆహారంలో చేర్చుకోండి..
Healthy Fat Foods: ఆరోగ్యంగా ఉండటానికి, సరైన ఆహారం, మంచి జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం. చాలా సార్లు ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాలను తమ డైట్‌లో తీసుకుంటారు. ఎందుకంటే.. వాటిలో మంచి ఫ్యాట్ ఉంటుంది. అటువంటి సూపర్ ఫుడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Mar 29, 2022 | 7:42 AM

బీన్స్: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూరగాయలను, ఆకుకూరలను తీసుకోవడం చాలా అవసరం. గ్రీన్ వెజిటేబుల్ బీన్స్ ఒకటి.. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీనిని అనేక విధాలుగా తినవచ్చు.

డార్క్ చాక్లెట్: చాక్లెట్ తినడం వల్ల రోగాలు మనల్ని చుట్టుముడుతాయన్న అపోహ చాలా మంది ప్రజల్లో ఉంది. డార్క్ చాక్లెట్‌ను తక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలోని ఆరోగ్యకరమైన కొవ్వును తిరిగి చేర్చుకోవచ్చని పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.

గుడ్లు: క్యాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు ఆరోగ్యకరమైన కొవ్వుకు మూలంగా పరిగణిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండు గుడ్లు తినాలని వైద్యులు, నిపుణులు కూడా సూచిస్తున్నారు. వీటిని పెద్దలు, పిల్లలు కూడా తినవచ్చు. అయితే.. గుడ్లను ఉడికించి తింటేనే మంచిది.

చేపలు: ఆరోగ్యకరమైన కొవ్వు ఆహారం విషయానికి వస్తే చేపలు ముందు వరసలో ఉంటాయి. చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. నాన్ వెజ్ తినే వారైతే ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

ఆలివ్ ఆయిల్: చెడు కొవ్వు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కావున ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నూనెలను మాత్రమే వంటల్లో ఉపయోగించాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఈ విషయంలో మీకు సహాయపడుతుంది.

కొన్ని ఆహార పదార్థాలల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అందుకే వాటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.




