AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

Puzzle Photo: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫోటోలు వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తిని రేపితే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని బాధపెట్టిస్తాయి.

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..
Woman Photo
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2022 | 8:05 PM

Share

Puzzle Photo: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫోటోలు వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆసక్తిని రేపితే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని నవ్వును తెప్పిస్తే.. మరికొన్ని బాధపెట్టిస్తాయి. మొత్తంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడొక ప్రపంచం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వినియోగదారుడు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏదో ఒక అకౌంట్ కలిగి ఉన్నారు. వాటిలో వచ్చే సమాచారాన్ని నిరంతరం చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా.. ఇట్టే జనాలకు తెలిసిపోతుంది. అయితే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతీది యూజర్లను అట్రాక్ట్ చేస్తాయని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. అట్రాక్ట్ చేసే అంశం మాత్రం తప్పకుండా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. తాజాగా అలాంటి అట్రాక్టీవ్, ప్రశ్నాత్మకమైన పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వాస్తవానికి అందులో ఒక అద్భుతమైన మహిళా కళాఖండం దాగుంది. అయితే, ఆ కళాఖండాన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అదే దాని స్పెషల్. అందుకే అంతలా వైరల్ అవుతోంది ఆ పిక్.

కళాకారులలో చాలా సజనాత్మకత ఉంటుంది. ఈ కళాఖండం ఎంత బాగుందంటే.. చూస్తే కళ్లు చెదిరిపోయేలా ఉంది. సాధారణంగానే ప్రకృతిని, మహిళలను పోలుస్తూ కవితలు, పాటలు, పెయింటింగ్స్, కళాఖండాలు వేస్తుంటారు. ఇక్కడ కూడా అదేపని చేశారు శిల్పి. తనలోని ప్రతిభనంతా ప్రదర్శించడంతో అద్భుతం ఆవిస్కృతం అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇందులో అందమైన మహిళ దాగుందంటూ ఫజిల్ ఛాలెంజ్ విసిరారు. ఆ మహిళ ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ సవాల్ విసిరారు. వాస్తవానికి కొద్దిగా దృష్టి కేంద్రీకరిస్తే ఆ కళాఖండాన్ని కనిపెట్టడం చాలా ఈజీనే. కానీ, చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. మరి ఈ ఫోటోలో అమ్మాయి ఎక్కడ ఉందో మీరైనా కనిపెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆ మహిళ రూపాన్ని కనిపెట్టినట్లయితే.. ఆన్సర్‌ను కామెంట్‌ రూపంలో పేర్కొనండి.

Puzzle Pic

Puzzle Pic

Also read:

Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..

Monkey Stuck in Sea: ‘లైఫ్ ఆఫ్ పై’ని తలపించే స్టోరీ.. మూడు నెలలుగా నడిసముద్రంలోనే కోతి.. చివరకు ఇలా కాపాడారు..!

Puzzle: పొదల మాటున దాగుంది.. చిన్న క్లూ ఇచ్చి నేనెవరో కనిపెట్టండి అంటోంది.. మీరు కనిపెట్టగలరా?