AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puzzle: పొదల మాటున దాగుంది.. చిన్న క్లూ ఇచ్చి నేనెవరో కనిపెట్టండి అంటోంది.. మీరు కనిపెట్టగలరా?

Puzzle Photo: ఫజిల్.. ఫజిల్.. ఫజిల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్‌ను అటవి జంతువులు కూడా

Puzzle: పొదల మాటున దాగుంది.. చిన్న క్లూ ఇచ్చి నేనెవరో కనిపెట్టండి అంటోంది.. మీరు కనిపెట్టగలరా?
Puzzle
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2022 | 9:20 AM

Share

Puzzle Photo: ఫజిల్.. ఫజిల్.. ఫజిల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్‌ను అటవి జంతువులు కూడా వంటపట్టించుకున్నట్లున్నాయి. అందుకే హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడుతున్నాయి. తాజాగా ఓ జంతువుకు సంబంధించిన ఫజిల్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో చెట్ల చాటున ఓ జంతువు దాగుంది. కేవలం తోక మాత్రమే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

ఐఎఫ్ఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అటవీలో పర్యటిస్తుంటారు. ఇదే వారికి ప్రకృతి అందాన్ని వీక్షించే అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. అడవిలో ప్రతీ దృశ్యాన్ని వారు ఆస్వాధిస్తారు. తమ కెమెరాల్లో నేచర్ బ్యూటీని బందిస్తారు. తాజాగా అలాంటి బ్యూటీఫుల్ పిక్‌ని ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా పంచుకున్నారు. అయితే, చిన్న ఫజిల్ ఛాలెంజ్ విసిరారు. ట్విట్టర్ వేదికగా ఫోటోను షేర్ చేసిన సురేందర్ మెహ్రా.. ఆ ఫోటోలో దాగున్న జంతువు ఏంటో కనిపెట్టండంటూ సవాల్ విసారు. ఈ ఫోటోలో అడవిలో కొన్ని చెట్లు ఉన్నాయి. చెట్ల మాటున ఓ జంతువు దాగుంది. అయితే, చిన్న తోక మాత్రం కనిపిస్తోంది. దాన్ని క్లూగా చేసుకుని.. ఆ జంతువు ఏంటో చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. ఈ ఫజిల్ ఛాలెంజ్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. దానికి రకరకాల ఆన్సర్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కొందరు అడవి పిల్లి అంటే.. మరికొందరు బ్లాక్ పాంథర్ అని, ఇంకొందరు పిల్లి అని తమకు ఐడియా ఉన్నది చెప్పేస్తున్నారు. అయితే, చాలా మంది సరైన ఆన్సర్ చెప్పకపోవడంతో ఆయనే ఆ ఆన్సర్‌ను రివీల్ చేశారు.

Also read:

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..

Toll Plaza: టోల్ ప్లాజాల తొలగింపు.. వాహనదారులకు ఊరట లభించేనా..?

Viral Video: నాకూ ఒకటి కావాలి.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర అద్భుతమైన రియాక్షన్..!