Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..

MEMU Train Resume: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(MEMU) ట్రైన్‌ సర్వీసెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం నాడు

Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..
Memu Train
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2022 | 5:40 PM

MEMU Train Resume: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(MEMU) ట్రైన్‌ సర్వీసెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘మెము’ ట్రైన్ సర్వీస్‌లను పునరిద్ధరిస్తున్నామని, 01 ఏప్రిల్, 2022 తేదీ నుంచి ఈ సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన ప్రకారం ‘మెము’ సర్వీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

1 ఏప్రిల్, 2022 నుంచి నడనిచే ట్రైన్స్ షెడ్యూల్ ఇలా ఉంది.. 1. ట్రైన్ నెంబర్ 16111 తిరుపతి – పుద్దుచ్చేరి (Dep 04.20 – Arrival 12.50) 2. ట్రైన్ నెంబర్ 16112 పుదుర్చేరి – తిరుపతి (Dep 14.55 – Arrival 23.00) 3. ట్రైన్ నెంబర్ 06747 సూళ్లూరుపేట – నెల్లూరు (Dep 15.50 – Arrival 17.50) 4. ట్రైన్ నెంబర్ 06748 నెల్లూరు – సూళ్లూరుపేట (Dep 18.15 – Arrival 20.35)

‘మెము’ ట్రైన్ హాల్టింగ్ వివరాలు.. 1. ట్రైన్ నెంబర్ 16111/16112 తిరుపతి – పుదుచ్చేరి – తిరుపతి ‘మెము’: రేణిగుంట, పుడి, తడుకు, పుత్తూరు, వేపగుంట, ఏకాంబరకుప్పం, కాంచీపురం, కాంచీపురం(ఈస్ట్), వాలజబాద్, పాలూర్, చెంగల్‌పట్టు, మదురాంతకం, మెల్మరువత్తూర్, ఒలకూర్, తిందివనం, మైలమ్, విక్రవండి, విల్లుపురం, చిన్నబాబుసముద్రం స్టేషన్లలో ఈ రైలు హాల్టింగ్ ఉంది. 2. ట్రైన్ నెంబర్ 06747/06748 సూళ్లూరుపేట – నెల్లూరు – సూళ్లూరుపేట ‘మెము’: పోలిరెడ్డి పాలెం, దొరవారిసత్రం, నాయుడుపేట, పెదపరియ, ఓడూరు, గూడురు జంక్షన్, మనుబోలు, వెంకటాచలం, వేదాయపాలెం, నెల్లూరు సౌత్ స్టేషన్ లలో ఈ రైలు ఆగనుంది.

Also read:

WhatsApp: యూజర్లు చేజారి పోకుండా వాట్సాప్‌ కొత్త ప్లాన్‌.. ఇకపై 2 జీబీ ఫైల్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్‌.!

Telangana: మరో షాకింగ్ న్యూస్.. బస్ పాస్ ధరలను భారీగా పెంచిన TSRTC

Child sold: తల్లికి తెలియకుండా పురిటిబిడ్డను అమ్మిన కుటుంబం.. విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..!